Home / EDITORIAL / శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి .?

శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి .?

ఏపీలో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజక్ వర్గంలో  ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కంచు కోటగా ఉన్న మరో స్థానం  శ్రీకాకుళం అసెంబ్లీ నియోజక వర్గం .శ్రీకాకుళం పార్లమెంట్ నియోజక వర్గానికి 1984నుండి 2014 వరకు మొత్తం తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు పసుపు జెండాను ఎగిరింది .అయితే అసెంబ్లీ నియోజక్ వర్గంలో మాత్రం ఏకంగా పార్టీ స్థాపించిన దగ్గర నుండి ఎనిమిది సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఆరు సార్లు విజయ డంకా మోగించింది .యావత్తు శ్రీకాకుళం జిల్లాలోనే  ఈ  అసెంబ్లీ నియోజక స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. నియోజక వర్గంలో శ్రీకాకుళం టౌను (మున్సిపాలిటీ), శ్రీకాకుళం మండలము, గార మండలాలు ఉన్నాయి .నియోజక వర్గం మొత్తం జనాభా = 2,62,149.ఈ నియోజక వర్గంలో 2,33 ,278 మంది ఓటర్లున్నారు .

నియోజక వర్గ వ్యాప్తంగా  వెలమ 38,796,కాపు/తెలగ ఒంటరి 6,137,కాళింగ12,231,ఎస్సీ15,800,బెస్త/పల్లి/గండ్ల11571,యాదవ/గొల్ల 10446,రెడ్డిక/కొంపర    6569,ఎస్టీ931,వైశ్య11955,బలిజ6824,శ్రీశయన8955,ఒడ్డెర/ఒడ్డ 1709,రజక/చాకలి3934,దేవాంగ3219,మిగతా29194 మంది ఓటర్లున్నారు .గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటి చేసిన గుండ లక్ష్మీ దేవి 88,814 ఓట్లతో తన సమీప ప్రత్యర్ధి అయిన వైసీపీ తరపున పోటి చేసిన ధర్మాన ప్రసాదరావు(64,683ఓట్లు )పై 24 ,141 ఓట్ల మెజారిటీతో గెలిపొందారు . లక్ష్మీదేవి టీడీపీ పార్టీని స్థాపించిన మొదటిలో వరసగా నాలుగు సార్లు ఇదే నియోజక వర్గం నుండి గెలిచి దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ మంత్రి వర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన గుండా అప్పల సూర్య నాయుడు సతీమణి .

ఆ తర్వాత 2004 ,2009 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు చేతిలో ఆయన ఓడిపోయారు .నీతి నిజాయితీ గల ఎమ్మెల్యే గా ,మంత్రిగా పనిచేసిన అప్పలనాయుడు సతీమణి గా గత సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి నిలిచిన లక్ష్మీదేవికి  అప్పట్లో మంత్రి ధర్మాన ప్రసాదరావు మీద ఉన్న అవినీతి ఆరోపణలు ,ఆయన అనుచరవర్గం వ్యవహార శైలితో ప్రజలు పట్టం కట్టారు .మరి గత మూడున్నర ఏండ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న దేవి తన నియోజక వర్గ ప్రజలకు ఏమి చేశారు .?.అప్పుడు ఉన్న ఆదరణను ఆమె నిలబెట్టుకున్నారా ..?.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పరిస్థితి ఏమిటి ఒక లుక్ వేద్దాం ..!. ఇటీవల ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఎమ్మెల్యేల సర్వేలో మొట్ట మొదటి స్థానాన్ని తెచ్చుకున్న లక్ష్మీదేవి క్రమక్రమంగా కోల్పోయారు .గత మూడున్నర ఏండ్లుగా ఎమ్మెల్యే ,ఎమ్మెల్యే అనుచరవర్గం కొనసాగిస్తోన్న ఇసుక మాఫీయా ,ప్రాజెక్టుల పేరిట దోపిడీ ,ప్రభుత్వ నిధులను దుర్వినియోగం ,అధికారాన్ని అడ్డుపెట్టుకొని మరికొనసాగిస్తోన్న అక్రమాలు ,నాగావళి నది ఒడ్డున అక్రమంగా భారి ఎత్తున ఇసుకను తవ్వించడం లాంటి పలు అక్రమాలకు పాల్పడుతున్నారు అని నియోజక వర్గ ప్రజలు అంటున్నారు .

అంతే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు కోసం పనిచేసిన స్థానిక క్యాడర్ ను వదిలేసి మరి వాళ్ళ మీద అక్రమ కేసులను బనాయించడం కూడా ఆమె పై స్థానిక క్యాడర్ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు . నీరు చెట్టు ,సీసీ రోడ్ల వంటి పనులను చేపట్టిన కానీ ప్రజలకు కంటే తన అనుచరవర్గానికి ,తన జేబుల్లో ఆ నిధులు మళ్ళాయి అని ప్రజలు ఆరోపిస్తున్నారు .గత సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు ,త్రాగునీరు సాగునీటి సదుపాయం ,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ,కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణం,పేదవారికి ఎన్టీఆర్ ఇండ్ల పేరిట గృహ నిర్మాణం ,అరసవల్లి మాస్టర్ ప్లాన్ ,శ్రీకాకుళం రూరల్ మండలానికి త్రాగునీరు తో పాటు సాగునీరు అందించడం ,గార మండలానికి ఎత్తిపోతల పథకం ,బైరిదేశి గెడ్డ పనులు పూర్తీ వంటి  భారీ హామీలను కురిపించిన ఆమె వాటిని  అమలు చేయడంలో కూడా విఫలమయ్యారు .గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో కనీసం ఇరవై శాతం హామీలను కూడా నెరవేర్చలేదు అని ఓటర్లు ఎమ్మెల్యే మీద మండిపడుతున్నారు .నగరం చుట్టూ ఉన్న పద్దెనిమిది కాలనీలలో త్రాగునీటి సమస్య ,డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారు అని ఓటర్లు ఆవేదనను వ్యక్తం చేస్తోన్నారు .దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ఎవరు నిలబడిన కానీ చిత్తు చిత్తుగా ఓడించడానికి స్థానిక ఓటర్లు సిద్ధంగా ఉన్నారు .

ప్లస్ లు

*స్థానిక ప్రతిపక్ష పార్టీ నేతలు గ్రౌండ్ లో బలహీనంగా ఉండటం ..

మైనస్ లు

*ఇసుక మాఫియా ,అక్రమ దందాలు ..

*స్థానిక టీడీపీ క్యాడర్ ఎమ్మెల్యే పై తీవ్ర వ్యతిరేతకతో ఉండటం ..

*80 శాతం మంది ఓటర్లు ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తితో ఉండటం ..

*టీడీపీ సర్కారు మీద తీవ్ర వ్యతిరేకత ఉండటం ..

*గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 20 శాతం కూడా నేరవేర్చకపోవడం ..

పనితీరు -నియోజక వర్గానికి చెందిన ఎనబై శాతం మంది ఓటర్లు అసంతృప్తిగా ఉండేంతంగా బాగా పని చేస్తోన్నారు ..

మార్కులు -15 ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat