Home / ANDHRAPRADESH / చంద్రబాబు నువ్వు మారవా-అయితే జగన్ మారుస్తాడు ..?

చంద్రబాబు నువ్వు మారవా-అయితే జగన్ మారుస్తాడు ..?

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఆయన చెప్పే మాట నేను మారుతున్నాను .రోజుకు ఇరవై నాలుగు గంటలు పాటు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను .రానున్న రోజుల్లో దేశంలోనే కాదు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ను తీర్చి దిద్దుతా .నవ్యాంధ్ర రాజధాని అయిన అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ నెంబర్ వన్ రాజధాని గా చేస్తాను అని ఆయన చెప్పే ముచ్చట .అయితే నారా చంద్రబాబు నాయుడు మాటలు కోటలు దాటుతున్న కానీ చేతల్లో మాత్రం ఇంచే కూడా జరగడంలేదు అనేది వాస్తవం .తాజాగా ఆయన దసరా ఉత్సవాలను పురష్కరించుకొని విజయవాడలోని కనక దుర్గమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించడానికి వచ్చారు .

ఇంతవరకు బాగానే ఉంది .దుర్గమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్ర అభివృద్ధికి కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయి .ఒకవైపు మేము రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతుంటే మరోవైపు ఆ దుష్ట శక్తులు అడ్డుతగులుతున్నాయి అని ఆయన దుర్గమ్మ సాక్షిగా రెచ్చిపోయారు .అయితే గత దసరా నాడు ఇదే చంద్రబాబు వచ్చే దసరా నాటికి రాజధాని నిర్మాణాలు ,అసెంబ్లీ ,సచివాలయాల నిర్మాణాల నమూనాలను పూర్తిచేసి దసరా రోజు శంఖుస్థాపన చేసి మరల వచ్చే దసరా నాటికీ రాజధాని తదితర నిర్మాణాలను పూర్తిచేస్తాం అని అప్పుడు మీడియా సాక్షిగా ప్రకటించేశారు .అయితే తీరా హామీ ఇచ్చి ఏడాది అయిన కానీ దాని గురించి ఊసు ఎత్తకుండా దుష్ట శక్తులు అంటూ పరుష పదజాలం దుర్గమ్మ సాక్షిగా నోరు జారారు .

అయితే గత మూడున్నర యేండ్ల నుండి ఏ దేశంలో పర్యటిస్తే ఆ దేశ రాజధాని లా నిర్మిస్తా అని అంటూ బీరాలు పల్కుతూ వస్తోన్న చంద్రబాబు మొదట సింగపూర్ అని తర్వాత డల్లాస్ అని ఆ తర్వాత బ్రెజిల్ అని ఇలా పలు దేశాల రాజధానుల పేరు చెబుతూ వస్తోన్న చంద్రబాబు తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పేరును తీసుకువస్తూ రాజమౌళి సహకారంతోప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధానిగా చేస్తాను అని మరోమారి బీరాలు పలికారు .అయితే రాష్ట్ర అభివృద్ధికి దుష్ట శక్తులు అడ్డుతగులుతున్నాయి అని అంటున్న బాబు ఆ దుష్ట శక్తులు ఎవరు అనేది క్లియర్ గా చెప్పకపోయినా కానీ ఆ వ్యాఖ్యలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత ,వైసీపీ శ్రేణులను ఉద్దేశించే అని జగమెరిగిన సత్యం .

అయితే అధికారంలో ఉంది చంద్రబాబు .జగన్ కాదు .కానీ అభివృద్ధి ఏమి చేయకపోయిన జగన్ అడ్డుపడుతున్నాడు అని చౌకబారు విమర్శలు చేయడం చూస్తుంటే తను మారుతున్న మారుతున్న అని అంటుంటే బాబు మారకుండా ఎదుటివాళ్ళ మీద విమర్శలు చేస్తోన్నారు తప్ప ముందుకు ఏమి పోవడంలేదు .ఎన్నికలకు ఇంకో ఏడాదిన్నర సమయం ఉంది .ఈ ఏడాదిన్నర సమయంలో బాబు ఏమి చేయకపోతే జగన్ మాత్రం చంద్రబాబు ను ముఖ్యమంత్రి హోదా నుండి ప్రతిపక్ష హోదా కు మార్చడం ఖాయం అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు .

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat