Home / INTERNATIONAL / అదిరిపోయిన ATAI బతుకమ్మ సంబరాలు

అదిరిపోయిన ATAI బతుకమ్మ సంబరాలు

ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఇన్కార్పొరేషన్ (అటాయ్) ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే దసరా మరియు బతుకమ్మ ఉత్సవాలను ఈ సెప్టెంబర్ 24 ఆదివారం మెల్బోర్న్ లోని వెస్ట్ గేట్ స్పోర్ట్స్ సెంటర్, ఆల్టోనా నార్త్ లో ఘనంగా నిర్వహించారు. ఆటపాటలతో, తెలంగాణ పిండి వంటకాలతో, సాంప్రదాయబద్దంగా జరిగిన ఈ కార్యక్రమానికి 3 వేల మందికి పైగా హాజరు అయ్యారు. మొదటగా గౌరీ పూజ తో మొదలు పెట్టి భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలతో పాటు పెద్ద పెద్దబతుకమ్మలతో, కోలాహలంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. మొదటి మూడు బతుకమ్మలకు బంగారు నాణాలు, 70 బతుకమ్మలకు వెండి నాణాలు బహుమతిగా ఇచ్చారు.

ప్రముఖ గాయని శ్రీమతి తేలు విజయ గారు ముఖ్య అతిథిగా హాజరై, తన బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. విజయ గారి పాటలకు ఆడపడచులు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. శ్రీ మురళి బుడిగె గారు మరియు యాంకర్ మధులిక పసుమర్తి కార్యక్రమాన్ని నిర్వహించడంలో తోడ్పాటు అందించారు. ప్రముఖ సినీ నిర్మాత శ్రీ కాట్రగడ్డ ప్రసాద్ ఈ వేడుకలను ఎంతో మెచ్చుకొని కమిటీ సభ్యులను అభినందించారు.కమిటీ ప్రెసిడెంట్ ప్రవీణ్ దేశం , వైస్ ప్రెసిడెంట్ రఘు కోట్ల , సెక్రటరీ అనిల్ , ట్రెజరర్ రవిందర్ దామెర, కల్చరల్ కో ఆర్డినేటర్ అమరేందర్ అత్తాపురం, పి.ఆర్.ఒ. ఫణి కుమార్ రంగరాజు, యూత్ కో ఆర్డినేటర్ సంకీర్త్, ఫౌండర్ ప్రెసిడెంట్ రాజవర్ధన్ రెడ్డి ఉల్పాల , అడ్వైజరి సభ్యులు కృష్ణ వడియాల మరియు శ్యామ్ లింగంపల్లి, ఈవెంట్ కో ఆర్డినేటర్ కిరణ్ పాల్వాయి, గ్రాఫికల్ డిజైనర్ విష్ణు, ఇతర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కిశోర్ యన్నం, కర్ర శ్రీనివాస్, వంశీ కొట్టాల మరియు ఇతర సన్నిహితులు పుల్లా రెడ్డి బద్దం, సతీష్ పాటి, వంశీధర్ సోమ, దీపక్ హరి, పవన్ రంగరాజు, మహేష్ బద్దం, మధు పర్సా, శ్రీకాంత్ నగునూరి , సాయి చరణ్ రెడ్డి, రాహుల్ రెడ్డి, సంగీత్ రెడ్డి, హేమంత్ రెడ్డి తదితరులు బతుకమ్మ సంబరాలకు హాజరైన ఆడపడుచులకు, మెల్బోర్న్ లోని తెలుగు వారికి ధన్యవాదాలు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat