Home / LIFE STYLE / మార్కెట్ లోకి అతి త్వ‌ర‌లో నోకియా-2..!

మార్కెట్ లోకి అతి త్వ‌ర‌లో నోకియా-2..!

HMD గ్లోబల్ నోకియా -2 బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నవంబర్ లో లాంచ్ కానుంది. నోకియా -2 స్మార్ట్ ఫోనుకు సంబంధించి కొంత సమాచారం లీకైంది. నోకియా నుంచి వస్తున్న చీప్ అండ్ బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నోకియా-2,ఈ ఏడాది నవంబర్ లో ప్రారంభించనుందా లేదా అనే విషయంపై అధికారిక ప్రకటనలు రాలేదు. రానున్న రోజుల్లో ప్రకటించవచ్చు. మయన్మార్లో నోకియా ప్రతినిధి ఫేజీ సబ్ స్క్రైబర్ మరియు ఫేస్ బుక్ చందాదారుల మధ్య కన్వర్జేషన్ స్క్రీన్ షాట్ను ఆండ్రాయిడ్ హిట్స్ పోస్ట్ చేసింది. నోకియా 2 స్మార్ట్ ఫోన్ను నవంబర్ 2017లో మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.

నోకియా మయన్మార్ అనే పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజీ (సైబర్ సిటీ కో లిమిటెడ్ )మయన్మార్లో HMD గ్లోబల్ యొక్క అధికారిక డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌న‌ర్‌గా ఉంది. నోకియా ప్రతినిధి వెల్లడించిన సమాచారం మేరకు కొంత క్రెడిట్ ఉండే అవకాశం ఉంది. అయితే మయన్మార్‌లో ప్రారంభానికి నోకియా ముందుగానే గ్లోబల్ ప్రకటనను చేయనుంది. నోకియా విషయంలో సరళత లభ్యత కాలవ్యవధికి అనుగుణంగా ఉంటుంది. రిలీజ్ డేట్ కాకుండా, బడ్జెట్ అనుకూలమైన స్మార్ట్ ఫోన్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇప్పటికే లీక్ అయ్యింది. ఇది 5అంగుళాల HD డిస్ప్లే తో పాటు 4జి ఫోన్ ఫీచర్స్ ఉన్నాయి. నోకియా స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే.. ఇది బాక్స్ నుంచి స్టాక్ ఆండ్రాయిడ్ నౌగాట్ ఇంటర్పేస్ను అమలు చేస్తుంది.

స్నాప్ డ్రాగెన్ 212 ప్రాసెసర్ను తో రన్ అవుతున్న నోకియా 2, 1 జిబి లేదా 2జిబి ర్యామ్ తో కలిగి ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజి కెపాసిటి గురించి సమాచారం లేనప్పటికీ ఇది 16జిబిగా ఉంటుంది. నోకియా 3 వంటి మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా విస్తరించుకునే అవకాశం ఉంటుంది. నోకియా 2 మోడల్ సంఖ్య TA-1023, TA-1035,TA-1007 మరియు TA-1029నాలుగు రకాల్లో లభిస్తుంది. నాలుగు నుంచి TA-1023,TA-1007 మోడల్స్ సింగిల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది. అయితే ta-1035, TA-1029 డ్యుయల్ సిమ్ సపోర్ట్ తో రానున్నాయి. ఇక కెమెరాల విషయానికొస్తే.. నోకియా 2 బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్ కూడా షియోమీ రెడ్మీక, మోటో సి ప్లస్ పోటీగా శక్తివంతమైన 4000ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్ లేదు. నోకియా 2, నోకియా 3 కంటే తక్కువ బడ్జెట్ లో వస్తుంది. దీని ధర 9,499రూపాయలకు యూజర్లకు అందుబాటులో ఉండున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఖచ్చితమైన ధరకు సంబంధించిన సమాచారం లేదు. కానీ భారత్ లో 6,000వేల మార్క్ ఉన్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ ను స్వాధీనం చేసుకునేందుకు నోకియా ప్రయత్నిస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat