Home / JOBS / ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో ఉద్యోగాలు

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో ఉద్యోగాలు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఫైర్ సర్వీసెస్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35 వేల వరకు వేతనం చెల్లిస్తారు. వీరికి 20 వారాల పాటు శిక్షణ కూడా ఉంటుంది. ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో నియమిస్తారు.

జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్): 84
విద్యార్హతలు: విద్యార్హత‌లు: మెకానికల్/ ఆటోమొబైల్/ ఫైర్ సర్వీస్ ఇంజినీరింగ్‌లో కనీసం 50 శాతం మార్కులతో డిప్లొమా లేదా కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి లేదా మీడియం వెహికల్ లైసెన్స్ పొంది ఏడాది పూర్తవ్వాలి లేదా లైట్ వెహికల్ లైసెన్స్ పొంది రెండేళ్లు పూర్తవ్వాలి. శారీరక ప్రమాణాలు పురుషుల ఎత్తు కనీసం 167 సెం.మీ., చాతీ 81 నుంచి 86 సెం.మీ. ఉండాలి. మహిళల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు మినహాయింపు ఉంటుంది.

వ‌యసు: 2017 అక్టోబరు 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఏఏఐ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఫీజు కింద రూ.1,000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం: ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, రాత‌ప‌రీక్ష, స్కిల్ టెస్ట్/ డ్రైవింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, అర్థమెటిక్‌కు సంబంధించిన ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. ఒక్కో విభాగానికి 25 మార్కులు. దీనిలో జనరల్, ఓబీసీలకు కనీసం 50 మార్కులు, మిగతావారికి 40 మార్కులు రావాలి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన స్కిల్ టెస్ట్‌కు ఆహ్వానిస్తారు. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి అర్హులను ప్రకటిస్తారు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబరు 24
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివ‌రి తేది: అక్టోబరు 14

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat