Home / TELANGANA / హరీష్ రావుకు సిద్ధిపేట ప్రజలు ఫిదా -ఒకేసారి 21 లక్షల 50 వేల రూపాయలు ..!

హరీష్ రావుకు సిద్ధిపేట ప్రజలు ఫిదా -ఒకేసారి 21 లక్షల 50 వేల రూపాయలు ..!

నిరంతరం సిద్ధిపేట నియెాజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామి గా ఉంటూ అన్ని విషయాల్లో అండగా ఉంటూ నిరు పేద కుటుంబాలకు ఇంటి పెద్దకొడుకులా ధైర్యాన్ని ఇస్తున్న మంత్రి హరీష్ రావు మరోసారి తన మాన వీయతను చాటుకున్నారు..అనారోగ్యంతో,ప్రమాదాల్లో గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న తొమ్మిది మందికి ఒకేసారి 21 లక్షల 50 వేల రూపాయల వైద్య సదుపాయాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ద్వారా LOC లెటర్లను ఇప్పించారు..ఇప్పటికే అనేక సందర్భాలలో వేలాది మందికి కోట్లాది రూపాయల విలువచేసే LOC ను ఇప్పించి వారికి ప్రాణదానం చేసిన మంత్రి హరీష్ రావు తాజాగా మరో 9 మందికి LOC లు ఇప్పించి అండగా నిలిచారు..

సిద్ధిపేటకు చెందిన రాజేష్ అనే యువకుడు రోడ్డుప్రమాదంలో తీవ్రగాయాలై హైదరాబాద్ లోఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. వైద్యఖర్చులకు డబ్బు లేకపోవడంతో మంత్రి హరీష్ రావును ఆశ్రయిచారు.ప్రభుత్వం ద్వారా రాజేష్ వైద్య ఖర్చులకు 5 లక్షల 90 వేల రూపాయలు మంజూరు చేయించారు.. సిద్ధిపేట మండలం ఎన్సాన్ పల్లి గ్రామానికి చెందిన నిమ్మ వజ్రమ్మ అనే మహిళ నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లో చికిత్స పొందుతోంది.. ఆమె వైద్యానికి 4 లక్షల రూపాయల ను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించారు..
సిద్ధిపేటకు చెందిన మహ్మద్ ఖురేషీ అనే వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన చికిత్సకోసం 3 లక్షల రూపాయలు మంజూరు చేయించారు..

సిద్ధిపేట శ్రీనివాస్ నగర్ కు చెందిన M.శివ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ చకిత్సకు డబ్బు లేక పోవడంతో మంత్రిని ఆశ్రయించగా 2 లక్షల రూపాయలు మంజూరు చేయించారు..సిద్ధిపేటకు చెందిన సుష్మ అనే యువతి కిడ్నీ లు రెండురచెడిపోయి చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో మంత్రి స్వయంగా ఆమె ఇంటికి వెళ్ళి పరామర్శిచి ఆమె వైద్యానికి గతంలో 3 లక్షలు మంజూరు చేయించారు.. తాజాగా మరో 1లక్ష రూపాయలు మంజూరు చేయించారు..ఆమెకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా జరిగింది ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యం తో ఆమె ఆసుపత్రినుండి తిరిగి రానున్నది..

బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి అనే వ్యక్తి అనారోగ్యానికి గురికాగా ఆయన వైద్యానికి 2 లక్షల రూపాయలను మంజూరు చేయించారు.గజ్వేల్ కు చెందిన నాగరాణి అనే మహిళ చికిత్స కోసం 1లక్ష 50 వేల రూపాయలు మంజూరు చేయించారు..ఇదేవిధంగా S కమలమ్మ అనే మహిళ చికిత్సకోసం 2లక్షలు మంజూరు చేయించారు..అనారోగ్యంతో బాధ పడుతున్న ఓదెల గ్రామానికి చెందిన పి . రాజు వైద్యానికి 3 లక్షలు మంజూరు చేయించారు ..వీరికి సంబంధించిన LOC లెటర్లను వైద్యసంబంధమైన వ్యవహారాలు చూసే తన ప్రత్యేక కార్యదర్శి వెంకటేశ్వరరావుద్వారా సంధిత కుటుంబాలకు అందజేశారు..

అనారోగ్యాలతో,ప్రమాదాలలో గాయపడి అత్యవసర చికిత్సలకు డబ్బులేక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టడుతున్న కుటుంబాలకు గొప్ప మానవతా దృక్పధంతో స్పందిస్తూ ఆపద్భాంధవునిలా ఆదుకుంటున్న మంత్రి హరీష్ రావుకు ఆ కుటుబాలవారు ధన్యవాదాలు తెలియ జేస్తున్నారు..ఇప్పటికే సిద్ధిపేట నియెాజకవర్గమే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా,తెలంగాణలోని వివిధ జిల్లాల వారికి సైతం మంత్రి హరీష్ రావు LOC లు ఇప్పించి చికిత్సలు చేయించి ప్రాణదానం చేశారు .. పేద ప్రజల వైద్యంకోసం ఎంత ఖర్చునైనా ప్రభుత్వంద్వారా మంజూరు చేయిస్తున్న మంత్రి హరీష్ రావును,ఉదారంగా నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రిని బాధిత కుటుంబాలు వేనోళ్ళ కొనియాడుతున్నాయి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat