Home / INTERNATIONAL / బహరేన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బహరేన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ జాగృతి బహరేన్ శాఖ ఆధ్వర్యంలో మహా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగగా పేరొందిన బతుకమ్మను కొలుచుకొంటూ వేల సంఖ్యలో హాజరైన మహిళలు, పిల్లలు ఆటపాటలతో, కోలాటాలతో అలరించారు. అమితోత్సాహంతో మహిళలందరు రకరకాల పువ్వులతో పేర్చుకొని తెచ్చిన బతుకమ్మలు అందరిని ఎంతో ఆకర్షించాయి.

ఈ సందర్బంగా గల్ఫ్ దేశాల జాగృతి అధ్యక్షులు సిహెచ్. హరిప్రసాద్ మాట్లాడుతూ.. తాము తెలంగాణ సంస్కృతిని ఖండాంతరాల్లో చాటిచెప్పేందుకు ఈ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇట్టి బృహత్తర కార్యాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి కృషి చేస్తున్న తన కమిటీ సభ్యులందరినీ అభినందించారు. ఇంత గొప్పగా బతుకమ్మ సంబరాలను నిర్వహించడం చాలా గర్వంగా ఉందని అందుకు సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే పాటుపడుతూ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను బహరేన్ లో విస్తరించడానికి తమవంతు కృషి చేస్తామన్నారు.

ఈకార్యక్రంలో గల్ఫ్ దేశాల జాగృతి అధ్యక్షులు సిహెచ్. హరిప్రసాద్, బహరేన్ జాగృతి అధ్యక్షులు బరుకుంట్ల బాబు రావు,ఉపా అధ్యక్షులు మామిడాల ప్రభాకర్,ప్రధాన కార్యదర్శులు విజయ వర్ధన్ ,శ్రీనివాస్,సభ్యులు రవి,సుమన్ ,రాము,విజయసిందె ,మహేష్ ,రాజేష్ లు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat