Home / SLIDER / ఒకవేళ నల్గొండ పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగితే – గెలుపు ఎవరిది అంటే ..?

ఒకవేళ నల్గొండ పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగితే – గెలుపు ఎవరిది అంటే ..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌లో చేరిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి రెండో స్థానంలో నిలిచింది.అయితే గత మూడున్నర ఏండ్లుగా నల్గొండ జల్లాలో బలం తమదే నని చెబుతున్న విపక్షాలకు అక్కడే చెక్ చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. గుత్తా రాజీనామా చేసినా ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ఇంకా 3, 4 నెలలు ఉండగా ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది.

ముందస్తు ఎన్నికలకు వెళితే మాత్రం నల్గొండ ఉప ఎన్నికకు, జనరల్ ఎన్నికలకు మధ్య పెద్దగా గ్యాప్ ఉండకపోవచ్చు. నల్గొండ లోక్ సభ ఉప ఎన్నిక తెలంగాణ గుండె చప్పుడు తెలియజేస్తుందనడంలో సందేహం లేదు. ఒక్క ఫలితంతో విపక్షాలకు నోళ్లు మూయించడం, వచ్చే ఎన్నికలకు లైన్ క్లియర్ చేసుకోవడం.. అనే రెండు రెండు లక్ష్యాలతో కేసీఆర్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. అందుకే కీలకంగా మారుతున్న నల్గొండ ఉప ఎన్నికపై తెలుగు మీడియాకు చెందిన ప్రముఖ ఛానల్ కోసం ఆర్జీ ఫ్లాష్ టీమ్ జనం మనోగతాన్ని ఆవిష్కరించింది. 12 ఏళ్లుగా ఆర్జీ ఫ్లాష్ టీమ్ సంస్థ నిర్వహించిన సర్వేలన్నీ వాస్తవాలను ప్రతిబింభిచాయి.

వేలెత్తి చూపించేలా ఒక్క సర్వే కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఈ టీమ్ నల్గొండ జిల్లాలో వారం రోజుల పాటు సర్వే నిర్వహించింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సర్వే నిర్వహించింది.నల్గొండ పార్లమెంట్ పరిధికి సంబంధించి కేసీఆర్ పనితీరు 45.45శాతం మంది బాగుందన్నారు. బాగాలేదని 28.12 శాతం, 26.37 శాతం మంది సంతృప్తికరంగా ఉందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా చూస్తే 53.10 శాతం మంది బాగుందన్నారు. పరవాలేదని 20.10శాతం, బాగాలేదని 26.80 శాతం మంది అన్నారు. జానారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ వెనుకబడిందని, ఉత్తమ్‌, కోమటిరెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు కాస్త అడ్వాంటేజ్‌గా ఉందని, డబుల్‌ బెడ్‌రూమ్‌, మూడెకరాల పథకాలపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని, కేసీఆర్‌ పనితీరుపై 76 శాతానికిపైగా సంతృప్తి ప్రజల్లో ఉన్నట్లు సర్వే పేర్కొంది. జీఎస్టీపైనా జనంలో పెను వ్యతిరేకత ఉందని తెలిపింది. నల్లగొండ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కి 46 శాతానికి పైగా ఓట్లు వస్తాయని, 39 శాతానికి పైచిలుకు ఓట్లతో రెండో స్థానంలో కాంగ్రెస్‌ ఉందని, టీడీపీ, బీజేపీలకు 8 శాతం మించదని ఆ సర్వే తెలిపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat