Home / SLIDER / తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీకి చోటు లేదా ..?

తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీకి చోటు లేదా ..?

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అది .డెబ్బై యేండ్ల స్వతంత్ర భారతదేశంలో అత్యధిక కాలం దేశాన్ని ఏలిన జాతీయ పార్టీ అది .భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన రాష్ట్రాలలో ఒకటైన అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన పార్టీ అది .ఇంతకు ఏ పార్టీ ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?అదే కాంగ్రెస్ పార్టీ .తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చోటు లేదా ..?. గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తోన్న 40 సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే అతి పెద్ద సంక్షేమం రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త చరిత్రను లిఖించింది .ఈ క్రమంలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న ప్రజాకర్షక పాలన వలన మరో పదేండ్ల వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చోటు లేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు .

అరవై ఏళ్లలో సమైక్య పాలనలో వివక్షకు గురైన తెలంగాణ ప్రజల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొంగొత్త వెలుగులు తీసుకువస్తున్నారు..పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు..అలాగే ప్రత్యక్షంగా ప్రజలకు చేరుతున్న పింఛన్లు, ఒంటరి మహిళలకు రూ. 1000 పింఛన్లు, పేదల కడుపు నింపుతున్న రేషన్ బియ్యం, పేదల ఆరోగ్యాన్ని పరిరక్షించే ఆరోగ్య శ్రీ, పేదింటి అమ్మాయిల వివాహానికి ఆర్థిక సహాయం అందించే కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు , గర్భిణీ స్త్రీలకు, శిశువుల ఆరోగ్యం కోసం కేసీఆర్ కిట్లు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పేదల సొంతింటికలను నిజం చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇలా పలు ప్రజా సంక్షేమ పథకాలతో గత ప్రభుత్వాల కంటే భిన్నంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది .

తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా కనుమరుగైన 40 వేల చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్దరణ ,రైతులకు 9 గంటల పాటు పగటిపూటనే నిరంతర విద్యుత్ ను అందించడమే కాకుండా వచ్చే ఏడాది నుంచి రైతులకు కూడా 24 గంటల నిరంతర విద్యుత్ అందించబోతున్నారు.అంతే కాకుండా రైతు రుణమాఫీని నాలుగువిడతలుగా మొత్తం రూ. 17, 000 కోట్ల రుణాలను పూర్తిగా మాఫీ చేశారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా చేపట్టిన వినూత్న పథకం ఎకరాకు నాలుగు వేల రూపాయలు రైతులకు అందజేయడం ..తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి నల్లానీరు అందించేందుకు చేపట్టిన మిషన్ భగీరథ,స్వరాష్ట్రంలో ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, అంగన్ వాడీ వర్కర్స్, పోలీసులు, హోంగార్డులు మున్సిపల్ కార్మికులు, ఆశావర్కర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇలా సబ్బం వర్ణాల వారికి జీతాలు రెట్టింపు చేసి వారి జీవితాల్లో సరి కొత్త కాంతులు ప్రసాదించడం ..

త్వరలోనే కాంట్రాక్ట్ ఉద్యోగాలను, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను క్రమబద్దీకరణ ఇలా పలు పథకాలతో టీఆర్ఎస్ పార్టీ మరో పదేండ్ల వరకు ఏ పార్టీకి చోటు లేకుండా చేస్తోంది .అంతే కాకుండా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం టీహాబ్ లాంటి వినూత్న పథకాన్ని అమలు చేయడం .ఎస్సీ ,బీసీ ,ఎస్టీ యువతకు ఆయా కార్పోరేషన్ల ద్వారా రుణాలను మంజూరు చేసి సొంతంగా ఆర్ధికంగా సామాజికంగా ఎదగటానికి టీఆర్ఎస్ సర్కారు కృషి చేయడం ఇలా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రజలలో చెరగని ముద్ర వేసుకుంటుంది .ఇదే విషయం గురించి ఇటీవల విడుదలైన సింగరేణి ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .అంతే కాకుండా గొర్రెలు ,బర్రెలను పంపిణి చేయడం ..బంగారు తెలంగాణ లో హరిత తెలంగాణ ను చూడటం కోసం హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ..చేప పిల్లల పంపిణీ ..రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేస్తుండటం కూడా టీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడటానికి కారణం అని రాజకీయ వర్గాలు అంటున్నారు .ఇలా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వలన తెలంగాణ లో ఏ పార్టీకి అవకాశం లేకుండా దూసుకుపోతుంది టీఆర్ఎస్ పార్టీ ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat