Home / LIFE STYLE / స్త్రీలు కుంకుమ ఎందుకు ధరించాలి..!

స్త్రీలు కుంకుమ ఎందుకు ధరించాలి..!

కుంకుమతో ఎర్రెర్రగా బొట్టుపెట్టుకోవడం ఇప్పుడు బాగా తగ్గిపోయినా.. పండుగలూ, పబ్బాలప్పుడు వాడుతూనే ఉన్నాం. మహిళలు కుంకుమ ఎందుకు ధరించాలంటే … భర్త ఉన్నాడు అనడానికి, ఆమెకు పెళ్ళి అయ్యిందని తెలపడానికి సంకేతంగాను నుదుటున కుంకుమ ధరించాలి.పెళ్ళైయిన ప్రతి స్త్రీ తప్పకుండా నుదుటున కుంకుమ ధరించాలి అని సాక్షాత్తు ఆ జగన్మాత అయినా పార్వతీ దేవి ఆజ్ఞాపించారని మన పురాణాలు చెబుతున్నాయి.చూచి చూడగానే కొంచం పెద్దబొట్టు పెట్టుకుని స్త్రీ కనబడగానే, మనకు తెలిసిపోతుంది ఆమెకు పెళ్ళి అయ్యిందని, సుమంగళి అని.అదే నిలువుబొట్టు పెట్టుకుని కనిపిస్తే ఆమె ఇంకా కుమారి అని, పెళ్ళి కాలేదని అర్ధం.

అసలు సుమంగళి అయిన స్త్రీ మొత్తం అయిదు స్థానాలలో కుంకుమ ధరిస్తే ఆ స్త్రీకి వైధవ్యం ఉండదని సాక్షాత్తు ఆ జగదాంబ చెప్పిందట.ఎక్కడ ఎక్కడా అంటే…

*పాపిట్లో ఒక బొట్టు పెట్టుకోవాలి. సీతాదేవి పాపిట్లో సింధూరం ధరించి, దానిపై పాపిడిబిళ్ళను( దానినే చూడామణి అని అంటారు) ధరించేదట, ఆంజేయనేయస్వామి ఎందుకమ్మా సింధూరం ధరిస్తున్నావు అని అడిగితే, నా స్వామీ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాడని, నా వైపు ఆకర్షితుడవుతాడని చెప్పడంతో, స్వామీ తన శరీరమంతా సింధూరం పూసుకోవడం అలవాటుగా చేసుకుని శ్రీరామచంద్రుడికి ప్రీతిపాత్రుడయ్యాడు.
*కనుబొమల మధ్యన—భర్త ఆయుష్షు పెరగడానికి, నిత్య సుమంగళిగా ఉండాటానికి.
*కంఠం దగ్గర
*వక్షస్థలం మధ్యన
* నాభి దగ్గర

ఈ అయిదు చోట్ల కుంకుమ ధరించిన స్త్రీకి వైధవ్యం లేకుండా, భర్త కన్నా ముందే తానే సౌభాగ్యవతిగా వెళ్ళిపోవడానికి దోహదపడతాయి.సీతాదేవి ఇలా ధరించడం వలనే రాముని కన్నా ముందే తన అవతారాన్ని చాలించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat