Home / SLIDER / విపక్షాలకు సింగరేణి ఎన్నికల ఫలితాలు చెప్పిన పాఠం ..!

విపక్షాలకు సింగరేణి ఎన్నికల ఫలితాలు చెప్పిన పాఠం ..!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదల అయిన సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం సాధించడం ఆ పార్టీకి ఆనందదాయకమే.ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజమాబాద్ ఎంపీ కవిత ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుని ప్రచారం నిర్వహించి , మొత్తం ఎన్నికలకు విశేష ప్రాధాన్యం తెచ్చారు. చివరికి ముఖ్యమంత్రి కూడా రంగంలో దిగి సింగరేణి కార్మికులను ఉద్దేశించి టీవీలలో మాట్లాడారంటేనే అధికార పార్టీ ఈ ఎన్నికలను ఎంత సీరియస్ గా తీసుకుంది అర్దం అవుతుంది.గతంలో ఎన్నడూ ఒక సంస్థ కార్మిక సంఘం ఎన్నికకు ఇంత ప్రాధాన్యత రాలేదు.ఒక వేళ ఉన్నా పరోక్షంగానే ప్రభుత్వంలో ఉన్నవారు స్పందించేవారు. కాని ఈసారి ప్రతిపక్షాలు ఈ ఎన్నికను గట్టిగా స్వీకరించడంతో అధికార పార్టీ సైతం ఆ సవాలును తీసుకోక తప్పలేదు. ప్రతిపక్షాలన్నీకలిసి కూటమి కట్టినా విజయం సాదించలేకపోయాయి.

అయితే భూపాలపల్లి, మందమర్రిలలో మాత్రం విజయం సాదించడం ఈ పక్షాలకు కొద్దిగా ఉపశమనం కలిగించే అంశమే. ఈ ఎన్నికల ప్రభావం జనరల్ ఎన్నికలపై పడుతుందా అన్నది చర్చనీయాంశంగా ఉంది. సాధారణంగా అయితే కార్మిక సంఘం ఎన్నికలు వేరు. సాధారణ ఎన్నికలు వేరు.అయినా ఎవరికి వారు పోటీగా తీసుకోవడం తో ఒక విధంగా ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంపై రిఫరెండమా అన్నంత దశకు వెళ్లింది.ఒకవేళ విపక్ష కూటమి కి చెందిన ఎఐటియుసి గెలిస్తే దాని ప్రభావం తెలంగాణ అంతటా పడితే , ఈ ఏడాది కాలంలో అది పెద్ద ప్రచారం అవుతుందని కేసీఆర్ భావించి ఉండవచ్చు.

ఇప్పుడు సింగరేణి ఎన్నికలలో గెలిచారు కనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా గెలుపు తమదేనని ధీమాగా వీరు ప్రచారం చేసుకోవచ్చన్నది వీరి విశ్వాసం.అయితే ప్రతిపక్షాలకు పట్టు ఉన్న భూపాలపల్లి, మందమర్రిలలో నలబై శాతం పైగా ఓట్లను సాదించడం ఒక పెద్ద సూచిక అవుతుందని అధికార పక్షం అంటుంది .స్థూలంగా చూస్తే ఒక విషయం కనిపిస్తుంది.అధికార పార్టీ హావా పూర్తిగా తగ్గలేదు.కాని నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులు ఏకపక్షంగా అధికార పార్టీ వెంటే ఉన్నారు అని అర్ధమవుతుంది .అదే సమయంలో విపక్షాలు కూడ అన్ని పార్టీలు కలిశాం ..ఇక తమదే గెలుపు అవుతుందన్న భరోసా పూర్తిగా రాలేదన్న విషయానని అర్దం చేసుకోవాలి.ఒక రకంగా చెప్పాలంటే సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు అధికార పార్టీ ను తట్టుకోవడం విపక్షాలన్నీ కలసిన కూడా వల్ల కాదు అని సంకేతాలు ఇచ్చినట్లు అర్ధం చేసుకోవాలి. దీంతో అధికార పార్టీ కి వచ్చే ఎన్నికలలో విజయావకాశాలు పెరుగుతాయి అని సంకేతాలు ఇచ్చింది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat