Home / ANDHRAPRADESH / వైసీపీ పై బాబు ఆస్థాన మీడియా సరికొత్త విషప్రచారం ..!

వైసీపీ పై బాబు ఆస్థాన మీడియా సరికొత్త విషప్రచారం ..!

ఏపీలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగలో నడుస్తుంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ .గత మూడున్నర ఏండ్లుగా నిన్న మొన్నటి వరకు వైసీపీ పార్టీకి చెందిన పలానా ఎమ్మెల్యే , ఫలానా సీనియర్ నేత వైసీపీ పార్టీని వీడుతున్నాడు.అంతే కాకుండా అధికార పార్టీ అయిన తెలుగుదేశంలోకి చేరుతున్నారు అని బాబు ఆస్థాన మీడియా రోజుకో కథనంతో వైసీపీ పార్టీ పై విషప్రచారం చేస్తోన్న సంగతి తెల్సిందే . అయితే చేసేదే విషప్రచారం కావడమే కాకుండా అవి ఎలాంటి ఆధారాలు లేకుండా రాసే వార్తలు కాబట్టి వైసీపీ శ్రేణులపై చేస్తోన్న అలాంటి ఫిరాయింపుల కథ కంచికి చేరింది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత నియోజక వర్గాల పెంపు జరుగుతుంది ఆశపడిన టీడీపీ అధినేత ఆశలపై నీళ్ళు చల్లారు ప్రధాని మోదీ .2024 వరకు నియోజక వర్గాల పెంపు ఉండదు అని తేల్చేసిన కేంద్ర సర్కారు .దీంతో ఇప్పటికే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశంలోకి ఫిరాయించిన వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కుతుందో లేదో.. అని సతమతం అవుతున్నారు.

దీంతో కొత్తగా ఫిరాయించే వాళ్లు కనిపించకుండా పోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మొన్నటి వరకూ.. వైసీపీ నుంచి వాళ్లు , వీళ్లు తెలుగుదేశంలోకి పోతున్నారు అని టీడీపీ అనుకూల మీడియా రాసుకుంది. పన్నెండు మంది ఎమ్మెల్యేలు అని మొదట, ఎనిమిది అని మళ్లీ రకరకాల రాతలు రాశారు. అయితే అవేవీ జరిగేలా కనిపించడం లేదు.ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం అనుకూల మీడియా కొత్తరకం శునకానందాన్ని పొందుతోంది. ఈ సారి పార్టీలు మారుతున్నారు.. అని కాకుండా, వైసీపీలోనే ఉంటారు. కానీ పోటీ చేయరు.. అనే ప్రచారాన్ని చేస్తోంది టీడీపీ మీడియా.

విజయనగరం జిల్లా విషయంలో కొలగల్ల వీరభద్రస్వామి, ప్రకాశం జిల్లాలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విషయంలో ఇలాంటి ప్రచారమే సాగిస్తోంది టీడీపీ అనుకూల మీడియా, వీళ్లు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరు..ఇది జగన్ కు షాకే అని ఈ మీడియా ప్రచారం చేస్తోంది.
మరి ఏం జరిగినా అది జగన్ కు షాకే.. అన్నట్టుగా ప్రచారం చేయడం టీడీపీ అనుకూల మీడియాకు మొదటి నుంచి అలవాటే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో అలాగే రాశారు. అలాంటి ఫిరాయింపులు జగన్ కు తలనొప్పిగా మారడం అటుంచితే.. వచ్చి చేరిన వారితో తెలుగుదేశం పార్టీనే ఇప్పుడు గత్తరబిత్తర అవుతోంది. ఇక ఫిరాయించే ఉద్దేశం లేని వారి పేర్లను కూడా ఫిరాయిస్తున్నారు అంటూ రాసి. .కొంత హడావుడి చేసింది టీడీపీ మీడియా. ఇప్పుడు వైసీపీలోనే ఉంటారు కానీ పోటీ చేయరు.. ఇదీ జగన్ కు షాకే అని రాస్తోంది.ఒకవేళ సదరు నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. అందుకు పార్టీ అంతర్గత వ్యవహారాలు, వ్యూహాలే కారణం అవుతాయి కానీ మరోటి కాదు. వీటిని ఆధారంగా చేసుకుని టీడీపీ అనుకూల మీడియా ఏదేదే రాస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat