Home / MOVIES / స‌మంత క్యారెక్ట‌ర్ ఇదే..!

స‌మంత క్యారెక్ట‌ర్ ఇదే..!

టాలీవుడ్ మ‌న్మ‌థుడు అక్కినేని నాగార్జున న‌టిస్తున్న తాజా చిత్రం రాజుగారి గది-2. సమంత, సీరత్ కపూర్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఓంకార్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్ వదిలారు. సమంత లుక్ ఇది. ఈ లుక్‌లో సమంత పంతులమ్మగా కనిపించింది. తెల్ల పంచె, లాల్చీలో ఆమె ఉన్న ఈ ఫొటో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

గతంలో సమంత, రావు రమేశ్‌ పంచెకట్టులో ఉన్న ఫొటో ఒకటి వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. సమంత ఈ లుక్‌లో ఏ సినిమాలో కనిపిస్తారనే చర్చ జరిగింది. ఇక ఈ లుక్‌తో దానిపై క్లారిటీ వచ్చేసింది. కాగా ఈ సినిమా సెన్సారు కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది రాజుగారి గది మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ లో ఓ మలయాళం సినిమా రిమేక్ రైట్స్ ను కొనుక్కుని దానికి చాలా మార్పులు చేసి రాజుగారి గది 2 తీశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat