Home / MOVIES / అక్క‌డ వారి ప‌క్క‌లో ప‌డుకుంటేనే అవ‌కాశాలు..!

అక్క‌డ వారి ప‌క్క‌లో ప‌డుకుంటేనే అవ‌కాశాలు..!

సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోలు నన్ను పడకగదికి రమ్మన్నారని.. గ‌తంలో తెల‌గు హీరోల పై సంచ‌ల‌న‌ కామెంట్స్ చేసిని రాధికా ఆప్టే.. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్య‌లే చేసి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలు రాబట్టుకుంటూ బిజీ హీరోయిన్‌గా మారిన రాధికా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ దక్షిణాది అవకాశాలు రాకపోవడం వెనుక అసలు కారణాలు ఏంటి అని మీడియా వారు ప్ర‌శ్నిచ‌గా.. షాకింగ్ స‌మాధానం చెప్పారు.

ద‌క్షిణాదిన అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి కార‌ణాలు చెబుతూ.. ఎటు తిరిగీ పడక గదిలోకి రప్పించుకోవాలని దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో ప్రయత్నిస్తారు. పడుకొమ్మని ఫోర్స్ చేస్తారు..నాపై కూడా ఆ విషయంలో ఒత్తిళ్లు వచ్చాయి. అయితే వాటికి నేను తలొగ్గలేదు. అందుకే నేను అక్కడ అవకాశాలను కోల్పోయానని రాధిక చెప్పి సౌత్ సినీ ఇండ‌స్ట్రీ పై మరోసారి బాంబు పేల్చింది. అయితే ఈమె చేసిన కామెంట్స్‌ను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. చాలామంది హీరోయిన్స్ బాలీవుడ్ కు వెళ్ళాక ఇలాగే మాట్లాడతారని ఇవేమి కొత్త కాదని కొంతమంది సినిమా పెద్దలు కొట్టిపారేస్తున్నారు. అసలు నిజ నిజాలు ఏంటో ఆయా హీరోలకే తెలియాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat