Home / SLIDER / మంత్రి హరీష్ రావుపై సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు…

మంత్రి హరీష్ రావుపై సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు…

తెలంగాణ ఇరిగేషన్ మంత్రి, తన మేనల్లుడు హరీష్ రావుపై సిఎం కేసిఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ కు శంకుస్థాపన చేసిన తర్వాత జరిగిన సభలో సిఎం చాలా అంశాలపై వివరంగా మాట్లాడారు. మంత్రి హరీష్ రావును ఉద్దేశించి హరీష్ రావు ఈ మధ్య బాగా హుషార్ అయిండు. ముందుగా సిద్ధిపేటను జిల్లా చేస్తే చాలన్నడు. జిల్లాను చేసిన తర్వాత ఊకుంటలేడు. ఇప్పుడేమో మెడకిల్ కాలేజీ కావాలన్నడు.

హరీష్ కోరిక నెరవేరుస్తున్న సిద్ధిపేటకు మెడికల్ కాలేజీ మంజూరు చేసినం. ఇంకో ఏడాదిలోగా సిద్ధిపేట బ్రహ్మాండంగా తయారైతది. మెడికల్ కాలేజీ వస్తది. కలెక్టరేట్ పూర్తయితది. జిల్లా అద్భుతంగా మారిపోతది. సిద్ధిపేటకు ఏమిచ్చినా తక్కువనే. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే. ఇంకా చాలా చాలా అభివృద్ధి సిద్దిపేటకు వస్తది. సిద్ధిపేటకు నేను వస్తున్న కాబట్టి నాకు సంతోషం కలిగించడానికి దేవుడు కూడా వాన కురిపించిండని నాకు అర్థమైంది. సిద్ధిపేట పట్టణం చాలా గొప్ప పట్టణంగా రూపుదిద్దుకుంటది.

రంగనాయక సాగర్ పొంగిపొర్లుతున్నది. రాష్ట్రంలో నెంబర్ జిల్లాగా మీరు తయారు కావాలని కోరుతున్నాను. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డను దీవించడానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన అక్కలు, తల్లులు, అమ్మలకు పేరు పేరునా ధన్యవాదాలు చెబుతున్నాను. కోమటిచెరువు కట్టను బాగా చేయడానికి 25 కోట్లు మంజూరు చేస్త.
కోమటిచెరువు కట్ట మీది నుంచే పోత. ఈ జిల్లా కలెక్టర్ అభినందనీయుడు. కష్టపడి పనిచేస్తున్నరు. ఎన్ని డబుల్ బెడ్రూములు కావాలంటే అన్ని ఇస్తం.
ఇంకో వెయ్యి ఇండ్లు కావాలన్నడు కలెక్టర్ అవి కూడా మంజూరు చేస్తం. జై తెలంగాణ జై సిద్ధిపేట అంటూ నినాదాలు చేస్తూ కేసిఆర్ తన ప్రసంగం ముగించారు.అయితే హరీష్ ఈమధ్య బాగా హుషారైండు అన్న కామెంట్ విన్న హరీష్ రావు వేదిక మీదే పగలబడి నవ్వారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat