Home / MOVIES / లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌.. ఎన్టీఆర్‌గా మోనార్క్ న‌టుడు..!

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌.. ఎన్టీఆర్‌గా మోనార్క్ న‌టుడు..!

ఏపీ సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ గా ఈ సినిమాలో కనిపించబోయే నటుడు ఎవరు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ చిత్రాన్ని మిస్ట‌ర్ వివాదం డైరెక్ట్ చేస్తుండ‌డంతో.. ఈ సినిమాలో వివాదాస్పద అంశాలు ఉండే అవకాశాలు పుష్క‌లంగా ఉంటాయ‌ని తెలుస్తోంది. దానికి తగినట్లుగా వర్మ ఈ సినిమా విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ ల ద్వారానే కాక, మీడియాతో ఇంటర్వూల రూపంలోనూ పబ్లిసిటీ కాంపైన్ స్టార్ట్ చేసారు.

ఇక ఈ నేపధ్యంలో సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం…ప్రకాష్ రాజ్ ని ఈ పాత్ర కోసం అనుకుంటున్నట్లు సమాచారం. వర్మకు, ప్రకాష్ రాజ్ కు ఉన్న రిలేషన్‌తో ఈ చిత్రం కోసం ఆయన్ను అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ప్రకాష్ రాజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని స‌మాచారం. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రారంభించి వచ్చే అక్టోబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat