Home / MOVIES / “నాగ చైత‌న్య‌-స‌మంత‌”పెళ్లి మాదిరిగా అది కూడా రెండు సార్లు అంట …!

“నాగ చైత‌న్య‌-స‌మంత‌”పెళ్లి మాదిరిగా అది కూడా రెండు సార్లు అంట …!

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ క‌పుల్ నాగ చైత‌న్య‌-స‌మంత‌లు గ‌త కొద్ది నెల‌లుగా ప్ర‌తి రోజు ఏదో ఒక టాపిక్‌తో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉన్నారు. వీరిరివురు ప్రేమించుకున్నార‌ని, త్వ‌ర‌లోనే వివాహం చేసుకుంటార‌నే రూమ‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ఇటు అభిమానుల‌లో, అటు మీడియాలో ప్ర‌తి రోజు వీరి పేర్లు నానుతూనే ఉన్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు మాంగ‌ల్య బంధంతో అక్టోబ‌ర్ 6న ఈ జంట ఒక్క‌ట‌య్యారు.

కేవ‌లం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలోనే వీరి వివాహం ఇటు హిందూ సంప్ర‌దాయం, అటు క్రిస్టియ‌న్ సంప్రదాయం ప్ర‌కారం జ‌రిగింది. రెండు రోజుల ఈ పెళ్లి వేడుక అభిమానుల‌లో చాలా ఆస‌క్తిని క‌లిగించింది. ఇక హైద‌రాబాద్‌లో నాగ చైత‌న్య‌, స‌మంత‌ల‌ రిసెప్ష‌న్‌కి నాగ్ గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నాడ‌ని ప‌లు వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికి , డేట్ ఎప్పుడ‌నేది క‌న్‌ఫాం కాలేదు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం స‌మంత‌, నాగ చైత‌న్య‌ల రిసెప్ష‌న్ కూడా రెండు సార్లు జ‌ర‌గ‌నుంద‌ని టాక్‌. ముందుగా నాగ చైతన్య తల్లి లక్ష్మీ చెన్నై లో గ్రాండ్ గా రిసెప్షన్ ని నిర్వహించనుంద‌ని, ఆ వేడుకలో దగ్గుపాటి ఫ్యామిలీ వారు అక్కినేని ఫ్యామిలీతో పాటు స‌మంత ఫ్యామిలీ వారు హాజరుకానున్నారట.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat