Home / MOVIES / కరీనాతో నాకు ఎఫైర్ ఉంది.. సినీ విశ్లేష‌కుడు సంచ‌ల‌నం..!

కరీనాతో నాకు ఎఫైర్ ఉంది.. సినీ విశ్లేష‌కుడు సంచ‌ల‌నం..!

బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తనను ప్రేమ పేరు తో మోసగించాడంటూ తెగ హంగామా చేస్తోంది. దీనిపై పబ్లిక్ గా కామెంట్లు కూడా చేస్తూ అతడిని బజారుకీడ్చేసింది. కొద్ది రోజులు దీనిపై సైలెంట్ గా ఉన్న హృతిక్ కూడా నోరు విప్పి కంగనా పచ్చి అబద్ధాలు చెబుతోందని కొట్టిపారేశాడు. కంగనాయే తన వెంటపడి వేధించేదంటూ ఆరోపణలు చేశాడు. ఈ యవ్వారం లో బాలీవుడ్ లోని సోనమ్, ఫర్హాన్ అఖ్తర్, కరణ్ జోహార్ లాంటి పెద్దలు హృతిక్ కే అండగా నిలిచారు. దీనిపై కంగనా చెల్లి రంగోలి అందరినీ బ్లేమ్ చేస్తూ తిట్ల దండకం కూడా అందుకుంది.ఈ మొత్తం కథలో కంగనా హృతిక్ తనతో ప్రేమ వ్యవహారం నడిపాడు అనడానికి అతడితో కలిసి తీయించుకున్న ఫొటోలే ప్రూఫ్ గా చూపిస్తోంది.

ఇలా కొంత కాలం నుండి కంగ‌నా- హృతిక్‌ల మ‌ధ్య జ‌రుగుతున్న వార్‌లోకి ప్ర‌ముక బాలీవుడ్ వివాదాస్ప‌ద విశ్లేష‌కుడు ఎంట‌రై మ‌రో ర‌చ్చ‌కి తెర‌లేపాడు. కలిసి ఫొటో దిగినంత మాత్రాన అఫైర్ ఉందని నిరూపించలేరంటూ కంగనా.. ఆమె చెల్లెలు రంగోలికి కౌంటర్ ఇస్తూ తనకు హీరోయిన్ కరీనా కపూర్ తో అఫైర్ ఉందని.. నాలుగేళ్లు మేము ప్రేమించుకున్నాం అంటూ బాంబులాంటి ఓ ట్వీట్ పేల్చాడు. తమ మధ్య ఉన్న సంబంధానికి ఇదొక్కటే ప్రూఫ్ అంటూ ఆమె పక్కన నిలబడి దిగిన ఓ ఫొటోని ఆ ట్వీట్ కి జతచేసాడు. హ్యాపీ గా సైఫ్ అలీఖాన్ ను వివాహం చేసుకుని ఓ కొడుకును కూడా కని సంతోషంగా ఉన్న ఆమెతో రిలేషన్ అంటాడేంటా అని అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అయితే ఇది నిజం కాదులేండి.. కంగ‌నా బ్యాచ్‌కి కౌంట‌ర్ ఇవ్వ‌డానికే కమార్ ఆర్. ఖాన్ ఇలా కరీనా పేరు.. ఆమె ఫొటో వాడేశాడన్న మాట. ఇలాంటివి మేము కూడా బోలెడన్ని చూపించగలమంటూ కంగనా ఆమె చెల్లి పేర్లు హ్యాష్ ట్యాగ్ చేసి మరీ సెటైర్ వేశాడు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat