Home / MOVIES / కులం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో జగపతి బాబు ..

కులం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో జగపతి బాబు ..

ఒకప్పటి స్టార్ హీరో ఇప్పుడు లేటెస్ట్ గా విలన్ క్యారెక్టర్ లో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు జగపతి బాబు .ప్రస్తుతం దేశాన్ని పీడిస్తున్న కులం గురించి నటుడు జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు .ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జగపతి బాబు కులం గురించి మాట్లాడుతూ “తనవద్దకు కొంతమంది వచ్చి ఇతడు మన కులానికి చెందినవాడు అని అంటుండేవారు .కానీ అలా ఎందుకు అనేవారో నాకు అప్పుడు అర్ధం కాకపోయేది .

అయితే వారు కులాన్ని మూలంగా చేసుకొని మాట్లాడుతున్నారు అని తర్వాత అర్ధమైంది .అయితే ఈ విషయం తెల్సిన తర్వాత కులం గురించి మాట్లాడుతుంటే అయితే ఏంటి అని అప్పటి నుండి కులం గురించి మాట్లాడేవారిని ప్రశ్నించడం మొదలెట్టాను అని అన్నారు .అయితే తన కూతురు అమెరికా వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటే చాలా మంది అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశారు .ప్రేమ అన్నది రెండు మనసులకు సంబంధించినది ..రెండు కులాలకు కాదు అని జగపతి బాబు అన్నారు .కేవలం ఈగో వలనే కులం గురించి మాట్లాడుతున్నారు .తమ కులం అయితే సపోర్టు చేస్తారు .

తమ కులం కాకపోతే తొక్కేస్తారు .వంద కోట్లు వస్తాయి అంటే మంత్రి కాళ్ళను కూడా పట్టుకోవడానికి సిద్ధపడతారు అని అన్నారు .అయితే కులాంతర వివాహాల గురించి మాట్లాడేవారు ..వారిలో అక్రమ సంబంధాలు పెట్టుకున్నావారు ఉన్నారు .అలా క్రమ సంబంధాలు పెట్టుకునే సమయంలో మాత్రం కులం చూడరు ..కేవలం సుఖాన్ని మాత్రమే కోరుకుంటారు అని విమర్శించారు .ఎప్పుడు పుడతామో తెలియదు ..ఎప్పుడు చస్తామో తెలియదు .అలాంటప్పుడు కమ్మగా బ్రతకాల్సింది పోయి కుల పిచ్చి ఎందుకు ఆయన అభిప్రాయపడ్డారు .

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat