Home / SLIDER / మంత్రి కేటీఆర్ చెప్పిన “ఆ ఫార్ములా”ను పాటిస్తే యువత జీవితం బంగారుమయం ..

మంత్రి కేటీఆర్ చెప్పిన “ఆ ఫార్ములా”ను పాటిస్తే యువత జీవితం బంగారుమయం ..

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు వరంగల్ పర్యటనలో భాగంగా నిన్న నిట్‌లో టాస్క్ కార్యాలయాన్ని ప్రారంభించి ..తదనంతరం ఆయన పలు కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకొన్నారు.ఈ సందర్భంగా నిట్ విద్యార్ధులతో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ మనం ముందుకుపోతున్న కొద్ది మన జీవితంలో ఎదురుదెబ్బలు కచ్చితంగా తగులుతాయి. వాటిని దీటుగా ఎదుర్కొన్నప్పుడే యువతలోని అసలైన చాలెంజ్ బయటపడుతుంది. చదువుకున్న చదువుకు ఉద్యోగం రాలేదని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు .

పదవతరగతి ఫెయిల్ అని మరికొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు .ఇంటర్ ఫెయిల్ అని ఇంకొంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు .అంతే కాదు ఇంట్లో అమ్మతిట్టిందని..నాన్న తిట్టాడు అని ..ఆఖరికి స్మార్ట్ సెల్‌ఫోన్ కొనివ్వలేదని ..ఇష్టమైన బండి కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకొంటున్నారు. మానసికంగా బలంగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది.ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం ..

ఏది అయిన బ్రతికి ఉండి సాధించాలి .ఇలా పలు చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదు .ప్రపంచంలో ఏ దేశానికి లేని సంపద యువత మనదేశానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఉంది .మీరు కష్టపడండి ..మీరు జీవితంలో పైకి రావడానికి మేము అండగా ఉంటాం ..అవసరమైతే సర్కారు తరపున మీకు ..మీ భవిష్యత్తు కోసం నిధులు కేటాయిస్తాం ..మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీ పెట్టె స్థాయికి ఎదగాలి .మీరు ఒకరి కింద పని చేయడం కాదు ..మీ కిందే వందల మంది పని చేసే స్థాయికి ఎదగాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు .మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఈ స్పీచ్ నిట్ ప్రాంగణం అంత చప్పట్లతో మారుమ్రోగింది ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat