Home / MOVIES / బిగ్ సెన్సేషన్..రాజమౌళి నెక్ట్స్ తీయబోయే రెండు సినిమాలు ఇవే…హీరోలు ఎవరో తెలుసా..!

బిగ్ సెన్సేషన్..రాజమౌళి నెక్ట్స్ తీయబోయే రెండు సినిమాలు ఇవే…హీరోలు ఎవరో తెలుసా..!

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తీరబోయే సిన్మాలపై ప్రపంచవ్యాప్తంగా క్యూరియాసిటీ ఏర్పడింది. బాహుబలితో ఇంటర్నేషనల్‌గా పాపులర్ అయిన రాజమౌళి తాజాగా అంతర్జాతీయ మేగజైన్ వెరైటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి సిన్మాలను కన్ఫర్మ్ చేశారు. బాహుబలి తర్వాత రాజమౌళి డివివి దానయ్యకు కమిట్ అయ్యారు..ప్రస్తుతం దానయ్య మహేష్‌తో కొరటాల శివ డైరెక్షన్‌లో` భరత్ అనే నేను ` మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగియగానే రాజమౌళి డైరెక్షన్‌లో ఓ భారీ చిత్రం షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.అయితే ఈ ప్రెస్టేజియస్ మూవీకి హీరోలు ఎవరనే సస్పెన్స్‌‌గా మారింది. గతంలో రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లతో డివివి ఓ భారీ సిన్మా తీయబోతున్నట్లు ప్రకటించారు..ఈ మేరకు రాజమౌళి సిన్మాలో హీరోగా చెర్రీ కానీ, బన్నీ కాని ఉంటాడా అనేది ఫిల్మ్‌నగర్‌లో చర్చ జరుగుతోంది..అంతే కాదు చెర్రీ, బన్నీ కాదు..ఎన్టీఆర్ నటిస్తాడంటూ మరో టాక్ వినపడుతోంది..గతంలో రాజమౌళి అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సిన్మా రాబోతుందంటూ వార్తలు వినిపించాయి..మరో పక్క రాంచరణ్‌తో మగధీర-2 కు కథ సిద్ధం చేస్తున్నానంటూ రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో డివివి సిన్మా మగధీర -2 అని గాసిప్ నడుస్తోంది..అయితే మగధీర -2 అల్లు కంపౌండ్ చేతి నుంచి దాటదని అల్లు సన్నిహితులు చెబుతున్నారు..మొత్తానికి డివివి, రాజమౌళి సినిమాలో హీరో ఎవరనేది సస్పెన్స్‌గా మారింది..ఇక రెండవ సినిమాకు మాత్రం హీరోను కన్ఫర్మ్ చేశాడు రాజమౌళి..సూపర్ స్టార్ మహేష్ హీరోగా నిర్మాత డీఎల్ నారాయణ సారథ్యంలో మరో భారీ చిత్రానికి కమిట్ అయినట్లు రాజమౌళి ప్రకటించాడు..ఈ చిత్రం 2019లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు చెప్పాడు.మొత్తానికి రాజమౌళి రెండు సిన్మాలకు కమిట్ అయినట్లు ప్రకటించడం టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. మరి నెక్ట్స్‌ మూవీలో హీరో ఎవరనేది స్టార్ హీరోల ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ రేకెత్తిస్తుంది..ఎవరికి వారు తమ హీరోనే రాజమౌళి సినిమాలో నటించబోయేది అంటూ వాదులాడుకుంటున్నారు. త్వరలో నిర్మాత డివివి హీరో ఎవరనేది ప్రకటిస్తాడో చూడాలి.