తెలుగు హాట్ యాంకర్ శ్రీముఖి కొన్ని సినిమాలలో నటించినా.. ఆశించినస్థాయి గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అయితే బుల్లితెర పై ఆమె చేసిన పటాస్ షో.. ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక పటాస్ షోలో యాంకర్ రవితో శ్రీముఖి చేసే సరసాలు.. డబుల్ మీనింగ్ డైలాగ్లు అప్పుడప్పుడు పతాక శీర్షికల్లోకి ఎక్కి రచ్చ రచ్చ చేసే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఎప్పటి నుండో రవి, శ్రీముఖిలు మధ్య ఎఫైర్ నడుస్తోందని.. ఇద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలు చెలరేగుతూనే ఉన్నాయి. వాటిపై వారు స్పందించిన అవి కేవలం రూమర్స్ అనే కొన్ని సార్లు కొట్టిపారేశారు.
అయితే ఇప్పుడు తాజాగా ఆలీతో జాలీగా ప్రోగ్రాంకి సంబందించిన ప్రోమోలో ఆలీ ప్రశ్నిస్తూ.. రవి అంటే ఏంటని శ్రీముఖిని అడుగగా.. రవి అంటే తనకి పిచ్చి అని.. ఎందుకంటే తనకు చిల్లర అబ్బాయిలంటే ఇష్టమని తెలిపింది. ఇక మీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్లు కొన్ని రూమర్స్ వచ్చాయి.. దాని గురించి ఏమంటారని ఆలీ ప్రశ్నించగా.. అవును మేమిద్దరం డేటింగ్లో ఉన్నాం.. రెండు సంవత్వరాల నుంచి కలిసి యాంకరింగ్ చేస్తున్నాం.. బయట కూడా కలుసుకుంటాం.. అందులో తప్పు ఏం ఉందని శ్రీముఖి చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఇక ఆప్రోగ్రాం ఫుల్ ఎపిసోడ్ సోమవారం ప్రసారం కానుంది.. మరి శ్రీముఖి-రవిల గురించి ఇంకెన్ని విషయాలు బయటపడుతాయో చూడాలి.