Home / MOVIES / వేశ్యగా మారిన‌ స‌దా..!

వేశ్యగా మారిన‌ స‌దా..!

తేజ‌ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జయం సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స‌దా సినీ పరిశ్రమలో కాలు పెట్టిన కొత్తలో వరుసపెట్టి అవకాశాలు అందుకుని టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందిన సదాకు ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి. టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ, అవకాశం చిక్కినప్పుడల్లా సినిమాలు చేస్తోన్న సదాకు తాజాగా మరో ఆఫర్ వచ్చింది. సెక్స్ వర్కర్ల జీవితం ఆధారంగా డైరెక్టర్ అబ్ధుల్ మాజిద్ తెరకెక్కించనున్న టార్చ్ లైట్ సినిమాలో సదా ఓ సెక్స్ వర్కర్ పాత్ర పోషిస్తోంది.

సెక్స్ వర్కర్ల రియల్ స్టోరీల ఆధారంగా గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఆ చిత్రాలన్నింటికన్నా తన చిత్రం భిన్నమైన కోణంలో వుంటుందంటున్నాడు డైరెక్టర్ మాజిద్. సదా, రిత్విక సెక్స్ వర్కర్ల పాత్రలు పోషించగా ఉదయ, శివశక్తి, దినేష్ వంటి కొత్త ఆర్టిస్టులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎంతోమంది హీరోయిన్స్ ఈ పాత్రకు నో చెప్పారు. అయితే సదా మాత్రం ధైర్యంగా అంగీకరించడమే కాకుండా ఎంతో బాగా నటించింది అని ఆమెని అభినందనల్లో ముంచెత్తాడు అబ్దుల్ మాజిద్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat