దీపావళి పండుగకి బిజినెస్ , షాపింగుల జోరు బాగా ఉంటుంది . వస్త్రాలు ,నగలు, దీపావళి గిఫ్ట్స్ ఇలా ధమాకా సేల్స్ నడుస్తున్నాయి . ఈ టైములో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి . అవి..
*షాపింగ్ బడ్జెట్ ను ,షాపింగ్ జాబితాను కూడా ముందే సిద్ధం చేసుకోవాలి . సమయం ఖర్చు కలసి వస్తాయి
*కాష్ బదులు డెబిట్/క్రేడిట్ కార్డులను వాడితే మంచిది
*పిల్లలను ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర వదిలి షాపింగ్ కు వెళ్లడం మంచిది
*డిస్కౌంట్ జాగ్రత్తగా గమనించలి .
*కొత్త దుస్తులు కొనుక్కునేప్పుడు ఒక్క సారి ట్రయల్ చేసి, తర్వాతే డబ్బులు చెల్లించండి లేకపోతె ఆఫర్లు , డిస్కౌంట్లతో ఇబ్బందులు ఎదురవుతాయి .
*షాపింగ్ కు వెళ్ళినప్పుడు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి బాటిల్ తో మంచి నీళ్లు తీసుకెళ్లడం మరవొద్దు . ప్రతి అరగంట లేదా గంటకొకసారి తప్పని సరిగా మంచినీళ్లు తాగుతుండాలి . నీళ్లు తాగకుండా గంటల తరబడి షాపింగ్ చేస్తే బాగా నిరాశపడతారు . బాగా అలసిపోయినట్టు అనిపిస్తే షాపింగ్ ఆపేసి ఇంటికి వెళ్లి పోవడం ఉత్తమం .
*కొన్ని షాపులు ఫ్రీ హోమ్ డెలివరీ ఆఫర్ కూడా ఇస్తుంటారు . అలంటి అవకాశం ఉంటె ఉపయోగించుకోవాలి . వస్తువులు మోసే బద తప్పుతుంది.
*షాపింగ్ చేయలేని సీనియర్ సిటిజెన్స్ బయటకు కాలు పెట్టకుండానే ఆన్ లైన్ సెట్స్ లో చీరల దగ్గరనుంచి అన్ని వస్తువుల ను కొనుక్కోవచ్చు ..