Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు కేసీఆర్ కు మధ్య తేడా అదే -టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్

చంద్రబాబుకు కేసీఆర్ కు మధ్య తేడా అదే -టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్

బాబు మోహన్ అంటే టక్కున గుర్తుకు వచ్చే డైలాగ్ “ఒక ముద్ద ఉంటే వెయ్యండమ్మో”తో తన ప్రస్తానాన్ని స్టార్ట్ చేసిన ఆయన అనతికాలంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగారు .ఆ తర్వాత ప్రముఖ నటుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాబు మోహన్ ఆ తర్వాత ఎమ్మెల్యేగా ,మంత్రిగా పనిచేశారు .ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు .ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కార్యక్రమానికి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ఉన్న తేడాను వివరించారు .

ఆ ఇంటర్వ్యూ లో 2001లో కేసీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు మిమ్మల్ని పిలవలేదు కదా?కదా అని అడిగితె దీనికి సమాధానంగా బాబు మోహన్ మాట్లాడుతూ ”
గతంలో ఉమ్మడి ఏపీలో నన్ను గెలిపించడానికి సిద్దిపేట ఏరియాలో మూడు నెలలు గ్రామాల్లో తిరిగారు కేసీఆర్‌. వ్యక్తిగతంగా చాలా మంచి అభిమానం ఉండేది. ఆయన పార్టీ పెట్టినప్పుడు నన్ను పిలవలేదు. ఇబ్బంది పెట్టలేదు కూడా. కానీ బాబు నాకు టిక్కెట్‌ ఇవ్వనన్నప్పుడు టీడీపీకి రాజీనామా చేశాను. ఇక రాజకీయాలు వద్దనుకున్నాను. అప్పుడే కేసీఆర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘బామ్మర్దీ రా’ అన్నారు.

‘నేను నిన్ను ఇంతవరకూ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు నీకు ప్రాబ్లమ్‌ వచ్చింది. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. రా..’ అన్నారు. అలా ఉదయం పిలిచాడు. సాయంత్రానికి నామినేషన్‌ వేయించాడు. గెలిపించాడు. బాబూ మోహన్‌కి టీడీపీ వాళ్లు అన్యాయం చేసారని జనం గ్రహించారు. వాళ్లూ వీళ్లూ కూడా ఒక్కటై నాకు మద్దతుగా నిలబడ్డారు.బాబు నాకు సినిమాల్లో ,రాజకీయాల్లో అవకాశాలు లేవని చంద్రబాబు పక్కన పెడితే ..కేసీఆర్ మాత్రం నన్ను అందలం ఎక్కించారు .కష్టాల్లో ఉన్నవార్ని వదిలేయడం బాబు నైజం ..కష్టాల్లో ఉన్నవార్ని ఆదుకోవడం కేసీఆర్ నైజం ..అందుకే కేసీఆర్ మహాత్ముడు అయ్యాడు అని అన్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat