Home / MOVIES / బిగ్ బ్రేకింగ్‌.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌.. చంద్రబాబు పాత్రలో న‌టించేది ఆ న‌టుడేనా..?

బిగ్ బ్రేకింగ్‌.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌.. చంద్రబాబు పాత్రలో న‌టించేది ఆ న‌టుడేనా..?

రామ్ గోపాల్ వర్మ త్వరలో తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లకల్లోలం సృష్టించడం ఖాయమేనా.. అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వర్మ ఎంచుకున్న సబ్జెక్ట్ అత్యంత వివాదాస్పదమైన అంశం. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి.. నివురుగప్పిన నిప్పులా కొందరి గుండెల్లో మాత్రమే రగిలిపోతున్న అంశాలపై వర్మ తన సినిమా ద్వారా ఆజ్యం పోయబోతున్నారు.

ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎలాంటి నటులను ఎంపిక చేస్తాడో అనే ఆసక్తితో తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తుంటే.. వర్మ మాత్రం ఎన్టీఆర్ పాత్రకి కొత్త నటుడిని లక్ష్మీ పార్వతి పాత్రకి కొత్త నటిని ఎంపిక చేస్తున్నట్లుగా ప్రకటించేశాడు. మరో కీలక పాత్ర అంటే వర్మ తీసే సినిమాలో చంద్రబాబు పాత్ర‌కి వర్మ ప్రియ శిష్యుడు జేడీ చక్రవర్తిని తీసుకుంటున్నాడా.. అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. వర్మ తన శిష్యుడు జేడీ చక్రవర్తిని విలన్ పాత్రకి కావాలని అడిగార‌ని… ఇద్దరి మధ్యలో ముంబై సాక్షిగా చర్చలు జరిగాయ‌ని వినికిడి. ఇప్పటీకే వర్మ, జేడీని విలన్ పాత్రకి ఎంపిక చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. చంద్రబాబులానే జేడీ చక్రవర్తి కూడా గెడ్డం పెంచుకుని ఉంటాడు కాబట్టి.. ఆ బాబు పాత్రకి జేడీ కరెక్ట్‌గా సెట్ అవుతాడని నెటిజెన్ల కూడా అంటున్నారు. అయితే ఈ జీనియ‌స్ డైరెక్ట‌ర్‌ జేడీని లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్ర బాబు పాత్రకి ఎంపిక చేసాడు అనే విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat