Home / NATIONAL / సింగపూర్ నెంబర్ వన్ -ఇండియా 75 ..ఎందుకు అలా ..?

సింగపూర్ నెంబర్ వన్ -ఇండియా 75 ..ఎందుకు అలా ..?

తాజాగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల పాస్‌పోర్టులకు గురించి వివరాలను అర్టన్‌ క్యాపిటల్‌సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో సింగపూర్‌ పాస్‌పోర్టు శక్తిమంత పాస్‌పోర్టుగా చరిత్ర సృష్టించింది .ఇతర దేశాలకు వీసా లేకుండా వెళ్లేందుకు అవకాశం, ఒక వేళ ఏదైనా అత్యవసర పనిమీద విదేశాలకు వెళితే అక్కడి విమానాశ్రయంలో జారీ చేసే వీసా ఆన్‌ అరైవల్‌… తదతర అంశాలను తీసుకొని ఈ ర్యాంకులను కేటాయించారు. ప్రపంచంలో అత్యంత చిన్న దేశాల్లో ఒకటైన సింగపూర్‌ పాస్‌పోర్టుకు ఇప్పటికే పలుదేశాలు సులభతర వీసా సౌకర్యం లేదా వీసా లేకుండానే ఆ దేశాల్లో పర్యటించే వెసులుబాటును కల్పించాయి.

దక్షిణ అమెరికాలోని పరాగ్వే కూడా సింగపూర్‌కు ఇలాంటి రాయితీలు కల్పించడంతో సింగపూర్‌ పాస్‌పోర్టుకు ప్రథమస్థానం దక్కింది. రెండో స్థానంలో జర్మనీ, మూడోస్థానంలో స్వీడన్‌, దక్షిణ కొరియాలు సంయుక్తంగా నిలిచాయి.భారత్‌ గతం కన్నా మూడు ర్యాంకులు పైకి చేరుకొని 75వ స్థానంలో నిలిచింది. సింగపూర్‌ వీసా ఫ్రీ స్కోరును 159 సాధించగా భారత్‌ వీసా ఫ్రీ స్కోరు 51 మాత్రమే ఉండటం గమనార్హం. మన కన్నా ఆర్థికాభివృద్ధిలో కిందస్థాయిలో ఉన్న మాలి, మడగాస్కర్‌, గబాన్‌, కామెరొస్‌ తదితర దేశాల స్కోరు మన కన్నా మెరుగుగా 52 ఉన్నట్టు తెలుస్తోంది.

భారత్‌ అంశాన్ని పరిశీలిస్తే భారత పాస్‌పోర్టు కలిగిన వారు 24 దేశాల్లో వీసా లేకుండా పర్యటించవచ్చు. మరో 27 దేశాలు భారతీయులకు వీసా ఆన్‌ అరైవల్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అదే సింగపూర్‌ పాస్‌పోర్టు కలిగిన వారికి వీసా లేకుండా తమ దేశంలో పర్యటించే అవకాశాన్ని 173 దేశాలు అనుమతించాయి. ఈ కారణంగానే సింగపూర్‌ ర్యాంకు మొదటిస్థానంలో ఉండగా భారత్‌ ర్యాంకు 75లో ఉంది. చైనా స్కోరు 60 పాయింట్లతో 67వ స్థానంలో మనకంటే కొంచం ముందంజంలో ఉండటం విశేషం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat