Home / TELANGANA / దేశంలో కేసీఆర్ ఒక్కరే..ఖలేజా ఉన్న సీఎం

దేశంలో కేసీఆర్ ఒక్కరే..ఖలేజా ఉన్న సీఎం

దేశంలో ఖలేజా ఉన్న సీఎం కేసీఆర్ ఒక్కరేనని విశాఖ శారదా పీఠాధిపతి స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.కార్తీక సోమవారం సందర్భంగా నవంబర్ 5న హన్మకొండ వేయిస్తంభాల గుడిలో ‘రుద్రేశ్వరుడి లక్ష బిల్వార్చన’ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి.. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాల కోసం ఆయుత చండీయాగం చేసి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారని కొనియాడారు.అనేక మంది ముఖ్యమంత్రులు వైదిక, పూజా కార్యక్రమాల్లో బొట్టుపెట్టుకొని తరువాత బొట్టు తుడిచేసుకున్నంత తేలికగా విస్మరిస్తారు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే తక్కువగా మాట్లాడి గట్టి కార్యాచరణ చేస్తారని కొనియాడారు. చరిత్ర ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కట్టడాలను కేంద్ర పురావస్తుశాఖ పరిధిలో నుంచి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి పునరుజ్జీవింప చేయాలని కోరారు.అంతేకాకుండ.. బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయడం, దాదా పు రూ.200 కోట్లు కేటాయించి వైదిక సంప్రదాయాలను పరిరక్షిస్తున్న సీఎం దేశంలో ఒక్క కేసీఆర్ మాత్రమేనని ఆయన ప్రశంసించారు.పురావస్తుశాఖ తీరుపై ఆయన మండిపడ్డారు. అదొక దిక్కుమాలిన సంస్థ, ఆ సంస్థకు భక్తి ఉండదు.. ఏమీ ఉండదు.. పవిత్రప్రాంతాలకు చెప్పులతో వెళతారు.. స్థల ప్రాశస్థ్యం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయ రు.. అంటూ దుయ్యబట్టారు. కాకతీయుల కట్టడాలను, దేవాలయాలను పురావస్తుశాఖ పరిధిలోంచి రాష్ట్ర పరిధిలోకి తేవాలని, ఇందుకు సీఎం కేసీఆర్ పూనుకోవాలని కోరారు.

వేయి స్తంభాల గుడి కల్యాణ మంటప నిర్మాణం ఆరు నెలల్లో పూర్తిచేస్తామని చెప్పిన కేంద్ర పురావస్తుశాఖ తొమ్మిదేండ్లయినా పూర్తి చేయలేదని పేర్కొన్నారు. ఆ శాఖ పనితీరుకు ఇదే నిదర్శమని ఉదహరించారు. తెలంగాణలో వేలాది దేవాలయాల్లో దూపద్వీప నైవేద్యాల కోసం చేపట్టిన బృహత్తర కార్యక్రమాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు. రాజ్యసభ సభ్యుడు, తమ పీఠం భక్తుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఆహ్వానం, వేయి స్తంభాల గుడి ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ కోరిక మేరకు తానిక్కడికి వచ్చానన్నారు. వేయి స్తంభాల గుడిలో పరమశివుడికి అభిషేకం చేస్తుంటే సాక్షాత్తు ఆ శివపార్వతులే వచ్చి స్వీకరించారా..? అన్నంత అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. కాకతీయ కట్టడాల పరిరక్షణ అనివార్యతను, వాటి పునరుజ్జీవ అవసరాన్ని తెలియజేస్తూ తాను సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat