Home / LIFE STYLE / కళ్ళు పగుళ్ళు తగ్గాలంటే..ఖర్చు లేకుండా అద్బుతమైన టిప్స్

కళ్ళు పగుళ్ళు తగ్గాలంటే..ఖర్చు లేకుండా అద్బుతమైన టిప్స్

కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే కలబంద జెల్ లో పసుపు కలిపి రాస్తే బాగా తగ్గుతాయి. ఇంకా నిమ్మకాయ ను రెండు చెక్కలు గా కోసి ఆ రసాన్ని అరికాళ్ళలో రుద్దితే పగుళ్ళు మంటలు తగ్గుతాయి. గోరింటాకు నూరి ఆ రసాన్ని రాసినా కూడా బాగా పనిచేస్తుంది. పిల్లలకు గాని పెద్దవారికి గాని షూ వేసుకున్నప్పుడు కాళ్ళ వ్రేళ్ళ మధ్య పాసినట్లు అయి దురదలు వస్తాయి ఇవి తగ్గాలంటే కొబ్బరినూనె లో కర్పూరం కలిపి రాస్తే వెంటనే తగ్గిపోతాయి.

చలికాలంలో పాదాలు పగులుతుంటాయి. ఈ పగుళ్లు తగ్గాలంటే… అర కప్పు కొబ్బరి నూనెలో 10 వేపాకులు, చిటికెడు పసుపు, చిటికెడు కర్పూరం వేసి మరిగించి, చల్లారిన తర్వాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా రెండు వారాల పాటు పాదాలకు రాసుకుంటే పగుళ్ళు తగ్గి మృదువుగా తయారవుతాయి.

చలికాలంలో ఆడ, మగ, చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవరి పాదాలైన పగలడం సహజం. దీంతోపాటు కాళ్లు కూడా గరుకుగా మారుతాయి. ఈ నేపథ్యంలో కింద పేర్కొన్న పలు చిట్కాలను పాటిస్తే కాళ్లు, పాదాలను సంరక్షించుకోవడంతోపాటు వాటిని మృదువుగా ఉంచుకునేందుకు వీలవుతుంది.
1.   రోజ్ వాటర్, గ్లిజరిన్ సమపాళ్ళలో తీసుకొని పగుళ్ళున్న చోట దూదితో రాసి, కొంత సమయం తరువాత కడిగివేయాలి.            ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే పగుళ్ళు క్రమంగా తగ్గుముఖం పట్టి పాదాలు మృదువుగా మారతాయి. దీన్ని కాళ్లకు                కూడా  రాసుకోవచ్చు.
2.   బొప్పాయి గుజ్జులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మర్దనా చేస్తే మడమలకున్న మురికి పోతుంది. క్రమంగా ఇలా             చేస్తే మురికి తొలగడమే కాకుండా పగుళ్ళు కూడా దరి చేరవు.
3.  పాదాలు మృదువుగా తయారవ్వాలంటే నాలుగు చెంచాల ఓట్ మీల్ పొడి, మూడు చెంచాల ఆలివ్ నూనె కలిపి మర్దనా           చేసి, అరగంట తరువాత చల్లని నీటితో కడగాలి. దీంతో మృతకణాలు(డెడ్ సెల్స్) కూడా తొలగిపోతాయి.
4. పావు బకెట్ నీళ్ళలో చెంచా కొబ్బరి నూనె, చెంచా వంటసోడా,చెంచా విటమిన్ ఈ నూనె వేసి అరగంట సేపు కాళ్ళు                  అందులో ముంచేలా ఉంచాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున చేయడం ద్వారా పాదాలు మృదువుగా ఉంటాయి.
5. నువ్వుల నూనెను గోరు వెచ్చగా వేడి చేసి రాత్రి పడుకునే ముందు రాసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి.
6. బెస్ట్ చిట్కా: కాళ్ళ పగుళ్ళు తగ్గాలంటే నిమిషం పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టి గరుకు రాయి తో రెండు రోజుల పాటు        రుద్దితే కాళ్ళ పగుళ్ళు తగ్గుముఖం పడతాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat