Home / MOVIES / ఆమెతో అఫైర్ లేదు…‘పెళ్లికి ముందు అఫైర్లు ,జీవితతో పెళ్లి తర్వాత కూడా…రాముని కాదు

ఆమెతో అఫైర్ లేదు…‘పెళ్లికి ముందు అఫైర్లు ,జీవితతో పెళ్లి తర్వాత కూడా…రాముని కాదు

గరుడవేగతో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ సక్సెస్ బాట పట్టారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ పవర్ చూపించాడు. ఈ మధ్యకాలంలో ఆయనను అనేక విషాదాలు చుట్టుముట్టాయి. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో రాజశేఖర్ ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడారు. రాజశేఖర్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

తన జీవితంలో కొన్ని అఫైర్లు ఉన్న మాట వాస్తవమేనని.. కానీ, తారా చౌదరితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజశేఖర్‌ స్పష్టం చేశారు.‘‘తారాచౌదరీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఆమె ఇంట్లో నా ఫొటో ఉండటం వల్లనే వివాదం మొదలైందని తెలిసింది. నాతో ఫోటో తీసుకోవడానికి వచ్చిన సమయంలోనే తొలిసారి తారాచౌదరీని కలిశాను. ఆ తర్వాత ఆమె అద్దెకుంటున్న పక్క పోర్షన్ జీవితతోపాటు వెళ్లినప్పుడు మరోసారి కలిశాను. అంతేతప్ప ఆమె చెప్పినట్లు నాకు-ఆమెకు దగ్గరి సంబంధాలు లేవు. ఒకవేళ అలాంటిది ఏమైనా ధైర్యంగా నేను చెబుతాను’’ అని రాజశేఖర్‌ తేల్చారు. తాను కేవలం జీవితకి మాత్రమే భయపడతానే తప్ప ఇంకెవ్వరికీ భయపడనని ఆయన చెప్పారు.

అయితే తనకు కొన్ని అఫైర్లు ఉన్న మాట వాస్తవమేనన్న ఆయన.. తారా చౌదరీ విషయంలో మాత్రం తాను రాముడని అభివర్ణించుకున్నారు. ‘పెళ్లికి ముందు అఫైర్లు ఉన్నాయి. జీవితతో పెళ్లి తర్వాత కొందరితో సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే అవి యాక్సిండెట్‌గా జరిగినవే’’ అని రాజశేఖర్‌ చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat