Home / ANDHRAPRADESH / కృష్ణ న‌ది బోటు ప్ర‌మాదం వెనుక ఏపీ మంత్రి..?

కృష్ణ న‌ది బోటు ప్ర‌మాదం వెనుక ఏపీ మంత్రి..?

కృష్ణా న‌ది బోటు ప్రమాదం ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రివర్ బోటింగ్ అడ్వెంచర్స్ సంస్థకు చెందిన ఈ బోటు కొండలరావు అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది. పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్ కు ఇద్దరిని మాత్రమే ఎక్కించుకునే విధంగా దీనికి అనుమతి కోరారు. అయితే, పూర్తి స్థాయి అనుమతులు రాకుండానే ఈ పడవను నడిపినట్టు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ రివర్ బోటింగ్ సంస్థ వెనుక ఏపీ టూరిజం శాఖ అధికారులు ఉన్నార‌ని.. వీరికి రాజధాని ప్రాంతం.. అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న సమాచారం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.

ఏపీ టూరిజం శాఖకు చెందిన ఉన్నతాధికారులే ఈ బోటింగ్ సంస్థను ప్రారంభించారని, పలువురు టూరిజం ఉద్యోగులు ఇందులో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. అందువల్లే ఈ ప్రమాదంపై ఇతర అంశాలు వెలుగులోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. టూరిజం అధికారులే బోటింగ్ సంస్థ యజమానులు కావడంతో అనుమతులు లేకున్నా బోటు నడుపుతున్నారని, దీనిని టూరిజం శాఖ చూసీ చూడనట్టు వదిలేసిందని తెలుస్తోంది. అంతే కాకుండా చీకటి పడే సమయంలో బోటు నడపకూడదన్న నిబంధనను కూడా పట్టించుకోలేదని, బోటు డ్రైవర్ కనీసం తన వెంట రూట్ మ్యాప్ కూడా తీసుకెళ్లలేద‌ని స‌మాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat