Home / SLIDER / ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రో..కేటీఆర్

ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్ట్ హైదరాబాద్ మెట్రో..కేటీఆర్

ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.ఈ నెల ]28న మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉందన్నారు. ఇప్పటికే మెట్రో ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం మోదీని ఆహ్వానించిందని గుర్తు చేశారు. దేశ చరిత్రలో మొదటిసారిగా 30 కిలోమీటర్ల మేర మెట్రోను ప్రారంభిస్తున్నామని చెప్పారు. నగరంలో మెట్రో రైలు నిర్వహణ కోసం రూ. 3 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 2,240 కోట్లు ఖర్చు చేశామన్నారు. కేంద్రం రూ. 1,458 కోట్లు సమకూరుస్తుందన్న మంత్రి.. రూ. 958 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. మొదటి దశ 30 కిలోమీటర్ల మెట్రోను ఈ నెలాఖరులో ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. మెట్రోను పూర్తిస్థాయిలో నడిపించేందుకు 57 రైళ్లు అవసరమన్నారు. అన్ని రైళ్లు కూడా వచ్చాయన్నారు. అన్ని రకాలుగా, అన్ని హంగులతో ప్రారంభానికి మెట్రో సిద్ధమైందన్నారు. మెట్రో రైలు పనుల్లో ఆలస్యం జరిగిందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాయగిరి రైల్వేస్టేషన్‌ను యాదాద్రిగా పేరు మార్చి అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.రాయగిరి రైల్వేస్టేషన్‌ను యాదాద్రిగా పేరు మార్చి అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు  . ఎంఎంటీఎస్ రెండో దశ పనుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కదలిక వచ్చిందన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ కోసం రూ. 817 కోట్లు కేటాయించామని తెలిపారు. ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరిస్తామని చెప్పారు. యాదాద్రికి భక్తులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో.. రవాణా వెసులుబాటు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఎంఎంటీఎస్ రెండో దశ పనులను పూర్తి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat