Home / MOVIES / నా పొట్ట‌.. బ‌ట్ట.. నాకు గ‌ర్వ‌కార‌ణం.. క‌త్తి మ‌హేష్‌

నా పొట్ట‌.. బ‌ట్ట.. నాకు గ‌ర్వ‌కార‌ణం.. క‌త్తి మ‌హేష్‌

మ‌హేష్ క‌త్తి. ప్ర‌స్తుతం సినీజ‌నాల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మ‌రీను. అయితే, మ‌హేష్ క‌త్తి మొద‌ట‌గా సినీ విశ్లేష‌కుడిగాను, ద‌ర్శ‌కుడిగాను అప్ప‌టికీ బిగ్‌బాస్(తెలుగు) మొద‌టి సీజ‌న్‌లో పాటిస్పేట్ చేసిన‌ప్ప‌టికీ రానంత క్రేజ్ ప‌వ‌ర్ స్టార్‌పై, జ‌న‌సేన పార్టీపై చేసిన వ్యాఖ్య‌ల‌తో ఒక్క‌సారిగా సెల‌బ్రెటీ అయిపోయాడు. ప‌వ‌న్ అభిమానులు ప్ర‌శ్నిస్తే, మ‌న‌ది ప్ర‌జాస్వామ్య దేశం, ఇక్క‌డ అంద‌రికి వారి వారి భావాల‌ను చెప్పుకునే అవ‌కాశం ఉంటుంది. నా భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను అడ్డుకునే హ‌క్కు మీకెక్క‌డిది..? అని ప్ర‌శ్నిస్తుంటారాయ‌న‌.

ప‌వ‌ర్‌స్టార్‌పై క‌త్తి మ‌హేష్ వివాద స్ప‌ద వ్యాఖ్య‌లు పీక్ స్టేజ్‌కు వెళ్లిపోవ‌డంతో ఆగ్ర‌హానికి గురైన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా క‌త్తి మ‌హేష్‌పై దాడికి దిగారు. మ‌రికొంద‌రైతే ..బ‌య‌ట ఎక్క‌డ క‌న‌ప‌డినా కొడ‌తామంటూ క‌త్తి మ‌హేష్‌కు ఫేస్‌బుక్ లైవ్ లైవ్‌లో బెదిరించారు కూడాను. ఏదేమైనా ఇటీవ‌ల కాలంలో సెబ‌బ్రిటీ స్టేట‌స్‌ను బాగానే పెంచుకున్నాడు క‌త్తి మ‌హేష్‌. ఇంకా కుప్తంగా చెప్పాలంటే సుమారు రూ.40 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన ప‌బ్లిసిటీ క‌త్తి మ‌హేష్ సొంత‌మైంద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

అయితే, గ‌త వారంలో ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లో టెలికాస్ట్ అయిన జ‌బ‌ర్ద‌స్త్ షో స్కి ట్‌లో హైప‌ర్ ఆది మ‌హేష్ క‌త్తిపై పంచ్‌ల వ‌ర్షం కురిపించిన విష‌యం  తెలిసిందే. ఆ స్కిట్‌లో హైప‌ర్ ఆది వాడిన పొట్ట‌, బ‌ట్ట అనే ప‌దాలు మ‌హేష్ క‌త్తిని ఉద్దేశించ‌న‌వే అంటూ ప‌లు మీడియాలు కూడా ప్ర‌సారం చేశాయి. ఇంకేముంది ఈ విష‌యం క‌త్తి మ‌హేష్ దృష్టికి పోవ‌డంతో వెంట‌నే ఫేస్‌బుక్ లైవ్ పెట్టేశాడు.

హైప‌ర్ ఆది వ్యాఖ్య‌లు త‌న‌ను చాలా బాధించాయ‌ని, అయితే త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను  ప‌ట్టించుకోన‌ని, లోపాల‌ను బ‌ట్టి మీరు మ‌నుషుల‌ను జ‌డ్జ్ చేస్తారా? అంటూ విరుచుకుప‌డ్డాడు. నా మీద సెట‌ర్ వేస్తే నేను ప‌ట్టించుకోనండి.. నా బాడీ ఎలా ఉంటే వారికెమిటి అంటూ ఫేస్‌బుక్ లైవ్‌లో ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు జ‌వాబిచ్చాడు మ‌హేష్ క‌త్తి. నేను లావుగా ఉంటే నేను మ‌నిషిని కాకుండా పోయానా..? అని, నా పొట్ట‌.. నా బ‌ట్ట త‌ల నాకు నిజంగా చాలా గ‌ర్వ‌కార‌ణం.. నాకు వాటితో స‌మ‌స్యేలేన‌ప్పుడు, నా వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి మీకెందుకంటూ జ‌బ‌ర్ద‌స్త్ షోపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు క‌త్తి మహేష్‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat