Home / MOVIES / రెజీనాకు బాగా పెరిగాయ‌ట‌!

రెజీనాకు బాగా పెరిగాయ‌ట‌!

ఎస్ఎంఎస్ చిత్రంతో తెలుగు ఇండ‌స్ర్టీలోకి అడుగుపెట్టింది త‌మిళ బ్యూటీ రెజీనా. ఇండ‌స్ర్టీలోకి ఆరంగ్రేటం చేయ‌డం త‌రువాయి ఎస్ఎంఎస్ చిత్రం మంచి కిక్‌ ఇవ్వ‌డంతో ఈ అమ్మ‌డును వ‌రుస అవ‌కాశాలు చుట్టుముట్టాయి. దీంతో త‌క్కువ కాలంలోనే బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదే స‌మ‌యంలో రెజీనాను గాసిప్స్ కూడా వెంటాడాయి. ఆ మ‌ధ్య‌న మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్, రెజీనా పెళ్లి చేసుకోబోతున్నార‌న్న వార్త‌లు కూడా గుప్పుమ‌న్నాయి. దీనికి కార‌ణం వీరిద్ద‌రు న‌టించిన పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాలు రెండూ మంచి హిట్ కావ‌డ‌మే. ఈ చిత్రాల్లో వీరి మ‌ధ్య కెమిస్ర్టీ బాగా పండింద‌ని, దానికి కార‌ణం వీరు ల‌వ్‌లో ఉండ‌ట‌మేనన్న వార్త‌లు షికార్లు చేశాయి. చివ‌ర‌కు ఆ గాసిప్స్ అన్నీ పుకార్లేన‌ని తేల్చేశారు సాయిధ‌ర‌మ్ తేజ్‌, రెజీనా.

అయితే, తాజాగా ఈ బ్యూటీ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పింది. త‌ను న‌టించిన బాల‌కృష్ణుడు చిత్రం డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని తెలిపింది. ఆ చిత్రంలో త‌న లుక్ డిసెంబ‌ర్‌లో బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని, అప్పుడు అంద‌రూ షాక్ అవ‌డం ఖాయ‌మ‌ని చెప్పింది. బాల‌కృష్ణుడు చిత్రంలో ఎప్పుడూ ట్రై చేయ‌ని మేక‌ప్‌ను వేసుకున్నాన‌ని, త‌న లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చాక నా అభిమానులు, ప్రేక్ష‌కులు సాక్‌గుర‌వ‌డం ఖాయ‌మంటూ చెప్పుకొచ్చింది. అంతేగాక, రానా తాజాగా న‌టిస్తున్న ఓ చిత్రంలో తానూ హీరోయిన్‌గా చేస్తున్నాన‌ని, , ఆ చిత్రంలోను తాను పూర్తిగా చీర క‌ట్టులోనే క‌నిపిస్తానంటూ చెప్పింది.

ఒకానొక సమ‌యంలో.. 2017 సంవ‌త్స‌రంలో నా కెరియ‌ర్‌ నేను కోరుకున్న‌ట్లుగా సాగ‌ట్లేద‌ని, అందులోనూ మంచి అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో డిప్రెష‌న్‌లోకి కూడా వెళ్లిపోయాను.. కానీ, త‌రువాత నా ఆలోచ‌న మారిపోయింది. నేను బాధ‌లో ఉన్న‌ప్పుడు జో అచ్యుతానంద వంటి మంచి సినిమాలో న‌టించ‌డంతో డిప్రెష‌న్ నుంచి తేరుకోగ‌లిగాన‌ని, సినిమా నాకు మంచి అనుభూతి క‌ల్పించింద‌ని రెజీనా తెలిపింది.  ఏదేమైనా రెజీనా చేతిలో ప్ర‌స్తుతం రెండు సినిమాలు ఉండ‌టంతో త‌న‌కు అవకాశాలు బాగా పెరిగాయ‌నే సంబ‌రంలో ఉండ‌టం గ‌మ‌నార్హం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat