Home / SLIDER / మంత్రి కేటీఆర్ ప‌నితీరుకు కొత్త‌పేరు పెట్టిన కెన‌డా మంత్రి

మంత్రి కేటీఆర్ ప‌నితీరుకు కొత్త‌పేరు పెట్టిన కెన‌డా మంత్రి

రాష్ట్ర అభివృద్ధిపై స్ప‌ష్టత‌, ఆయా అంశాల‌పై విశేష‌మైన ప‌రిజ్ఞానంతో, పూర్తి నిబద్ద‌త‌తో ప‌నిచేసే రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్‌కు అంత‌ర్జాతీయ సంస్థ‌ల్లో ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు దేశాల అధినేత‌లు మిగ‌తా వారితో పోలిస్తే…మంత్రి కేటీఆర్ ప‌నితీరు అద్భుత‌మ‌ని ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మరో విదేశీ ప్ర‌ముఖుడు మంత్రి కేటీఆర్‌కు కొత్త పేరు పెట్టారు. హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం మంత్రి కే తార‌క‌రామారావుతో సమావేశానంతరం కెనడా మంత్రి ప్రాంకోయిస్ పొగ‌డ్త‌లతో ముంచెత్తారు.
మంత్రి కే తార‌క రామారావు తెలంగాణ ఛీఫ్ మార్కెటింగ్ అఫీసర్ మాదిరి తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలను వివరించారన్నారు. ఈ సందర్భంగా భారతదేశాన్ని, తెలంగాణ రాష్ర్టాన్ని కెనడాలోని పెట్టుబడిదారులకు వివరించేందుకు కెనడాలో పర్యటించాల్సిందిగా మంత్రికి అహ్వానం అందజేశారు. ఇండో-కెనడియన్ చాంబర్ అఫ్ కామర్స్, కెనడా ప్రభుత్వం తరపున ఇందుకోసం ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ రోజు టీహబ్ లో పర్యటించిన తమకు తెలంగాణ ప్రభుత్వ ముందుచూపు, అవిష్కరణలు, ఇన్నోవేషన్ రంగం పట్ల ఉన్న నిబద్దతకు అద్దం పట్టింద‌ని తెలిపారు. టీ హబ్‌లోని యువకులతో సంభాషించినప్పుడు వారిలో ఉన్న ఉత్సాహం, అలోచనలు అద్భుతంగా ఉన్నాయని, ఇవీ కెనడాలోని ఇన్నోవేషన్ ఇకోసిస్టంకు ఏమాత్రం తీసిపోవని అన్నారు.
కాగా, అంత‌కముందు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరిత హారం వంటి కార్యక్రమాలను కెన‌డా మంత్రికి మంత్రి కేటీఆర్‌ వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక పాలసీ, ఐటి పాలసీలోని కీలక అంశాలను తెలియజేశారు. కెనడా దేశం నుంచి వచ్చే పెట్టుబడులకు పూర్తి సహాయ సహాకారాలు అందిస్తామని హమీ ఇచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat