Home / ANDHRAPRADESH / ఏపీలో సీన్ రివర్స్ -జనసేనలోకి టీడీపీ ఎమ్మెల్యే …?

ఏపీలో సీన్ రివర్స్ -జనసేనలోకి టీడీపీ ఎమ్మెల్యే …?

వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం .గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ..ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారం దూరం కావడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అయిన జగమెరిగిన సత్యం .అసలు పట్టు లేని ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీ క్లీన్ స్విప్ చేయడానికి ..మంచి ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ పార్టీకి ఒక్క సీటు రాకపోవడానికి పవన్ చేసిన ప్రచారమే .

అయితే తాజాగా ఏపీలో కాపు ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కారు గత మూడున్నర ఏండ్లుగా కాపు సామాజికవర్గం పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర విస్మయం చెందిన ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి రావడం ఖాయం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు .ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందని బోలెడు ఆశలు పెట్టుకున్న బొండాకు బాబు మొండి చేయి చూపించాడు .

దీంతో అప్పట్లో బొండా కాపు సామాజిక వర్గం గొంతు కోస్తున్నారు అని బాబుపై విరుచుకుపడ్డారు కూడా .ఆ తర్వాత చంద్రబాబు పిలిపించుకొని మరి విప్ పదవులను ఇస్తాను హామీ ఇవ్వడంతో సైలెంట్ అయిపోయారు .తాజాగా బాబు ప్రకటించిన అసెంబ్లీ విప్ ,ప్రభుత్వ విప్ పదవుల విషయంలో కూడా తనకు అన్యాయం జరగడంతో బొండా ఆలోచనలో పడ్డారు అంట .దీంతో టీడీపీలో ఉన్నంత కాలం తనకు న్యాయం దక్కదు .అందుకే తమ సామాజిక వర్గానికి చెందిన నేత పెట్టిన జనసేన పార్టీలో చేరాలని ..ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కల్సి పోటి చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ద్వారా పదవులను పొందాలని భారీ స్కెచ్ తో బొండా ఈ నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం .చూడాలి మరి నిత్యం జగన్ అండ్ టీం మీద విరుచుకుపడే బొండా గత కొంత కాలంగా మౌనంగా ఉండటం వెనక అసలు గుట్టు ఏమిటో ..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat