Home / TELANGANA / ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు..

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు..

ఈ నెల 28 తేదిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి హైదరాబాద్ పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ప్రధాని పర్యటనపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. బేగంపేట విమానాశ్రయం, శంషాబాద్   విమానాశ్రయం , మియాపూర్ , హెచ్ .ఐ.సి.సి , పలక్ నుమా పాలెస్ , గోల్కోండ ప్రాంతాలలో ఏర్పాట్లపై సమీక్షించారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధానమంత్రిని స్వాగతించడానికి ఘనమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
బేగంపేట విమానాశ్రయం ప్రధాన మంత్రికి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి , క్యాబినెట్ మంత్రులు స్వాగతం పలకనున్నట్లు సీఎస్‌ తెలిపారు. ఈ నెల 28న మధ్యాహ్నం ప్రధానమంత్రి  మెట్రో రైల్ ను ప్రారంభించిన అనంతరం హెచ్ఐసీసీలో జరిగే గ్లోబల్ ఎంట్ర్ ప్రెన్యుర్ సమ్మిట్  లో పాల్గొంటారని ప్రధాన కార్యదర్శి తెలిపారు. గ్లోబల్ ఎంట్ర్ ప్రెన్యుర్ సమ్మిట్  లో అమెరికా అధ్యక్షుల సలహాదారు ఇవాంకా ట్రప్ పాల్గొంటారని తెలిపారు. ప్రధానమంత్రి పర్యటించే మార్గంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. విదేశి అతిధులు బస చేసే ప్రాంతంలో పటిష్టమైన బద్రత చేయాలని అన్నారు.  ప్రధానమంత్రి పర్యటించే మెట్రో రైల్ ను అందంగా అలంకరించాలని సూచించారు. మెట్రో రైల్ కార్పొరేషన్ సంబంధిత ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు.
గ్లోబల్ ఎంట్ర్ ప్రెన్యుర్ సమ్మిట్ కు వచ్చే అతిధులకోరకు శంషాబాద్ విమానాశ్రయం లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హెచ్ఐసీసీలో గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించే ముందు అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారని అన్నారు. అనంతరం పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. వివిధ సంస్థ‌ల సీఈఓ లతో ద్వైపాక్షి క సమావేశంలో పాల్గొంటారని అన్నారు. ఈ సమావేశాలలో అమెరికా అధ్యక్షుల సలహాదారు ఇవాంకా ట్రప్ పాల్గొంటారని తెలిపారు.  పలక్ నుమా పాలెస్ లో ప్రధానమంత్రి ఇచ్చే విందుకు అతిధులను హెచ్.ఐ.సి.సి నుండి తీసుకోని వెల్లడానికి పకడ్భంది ప్రణాళిక ను రూపొందించాలని ఆదేశించారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం 29న గ్లోబల్ ఎంట్ర్ ప్రెన్యుర్ సమ్మిట్  అతిధులకు గోల్కోండ కోటలో ఇచ్చే విందుకు అన్ని ఏరాట్లు చేయాలని ఆధికారులను ఆదేశించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat