Home / MOVIES / జూలీ క‌థ నిజంగా ఆ ప్ర‌ముఖ‌ హీరోయిన్‌దేనా..?

జూలీ క‌థ నిజంగా ఆ ప్ర‌ముఖ‌ హీరోయిన్‌దేనా..?

సౌత్ సినీ హాట్ హీరోయిన్ ల‌క్ష్మీరాయ్ హీరోయిన్‌గా కంటే ఐటం గానే ఎక్కువ క్రేజ్ సంపాదించింది. ఇక అమ్మ‌డు తాజాగా జూలీ-2 చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. జూలీ చిత్రంలో ఈ హాటీ త‌న అందాల‌ను మొత్తం ఆర‌బోసింద‌ని ఆ చిత్ర ట్రైల‌ర్ చూస్తేనే అర్ధం అవుతోంది. ఇక విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న జూలీ-2 ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నా చిత్ర యూనిట్ ఆ చిత్ర క‌థ‌కి సంబందించి కొన్ని సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు.

జూలీ 2 చిత్రం.. 1990ల చివరలోని ఓ పాపులర్‌ హీరోయిన్‌ జీవితకథ ఆధారంగా తెర‌కెక్కింద‌ని.. జూలీ సినిమాలో కీల‌క పాత్ర పోషించిన న‌టుడితో ఆ ప్ర‌ముఖ హీరోయిన్‌కు ఎఫైర్ ఉంద‌ని చెప్పారు. అయితే ఆ హీరోయిన్ పేరు చెప్ప‌క‌పోయినా.. కొన్ని క్లూస్ ఇచ్చింది చిత్ర యూనిట్. మొద‌ట బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించిన ఆ హీరోయిన్.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిందని.. ఆ త‌ర్వాత అవ‌కాశాలు త‌గ్గ‌డంతో కోలీవుడ్‌కు వెళ్ళింద‌ని.. అప్పటికే పెళ్లయిన ఓ తమిళ హీరోతో ఎఫైర్‌ పెట్టుకోవడం వల్ల అది వివాదాస్పదమైందని… ఆ తర్వాత ఆమె భోజ్‌పురి సినిమాల్లో నటించిందని చెప్పారు. ఇచ్చిన క్లూల‌న బ‌ట్టి చూస్తే ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు న‌గ్మా అని ఎవరికైనా ఇట్టే అర్థమై పోతుంది.

ఇక‌ ఈ విషయాన్ని నగ్మా దృష్టికి తీసుకెళితే ఆమె దీన్ని తేలికగా తీసుకున్నారు. ఓ ఆంగ్ల దినపత్రికతో ఈ సందర్భంగా నగ్మా మాట్లాడుతూ నా గు రించి ఓ సినిమా వస్తోందని మొదటిసారిగా వింటున్నాను. ఇంతవరకూ నాకెవరూ చెప్పలేదు. పద్మావతి సినిమా మీదే ఇప్పుడందరి దృష్టీ ఉంది.. కనుక తమ సినిమా పబ్లిసిటీ కోసం ఇలా నా పేరు వాడుకుంటున్నారేమో నాకు తెలీదు. సినిమా చూడకుండా మాట్లాడటం పద్ధతి కాదు. చూశాక మాట్లాడదాం అన్నారు. నిజ‌మే మరి సినిమా ఓపెనింగ్స్ కోసం ఇప్పటికే హాట్ పిక్స్ హాట్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన చిత్ర యూనిట్‌.. ఇంకా బ‌జ్ రావ‌డానికి.. ఇలాంటి ప‌బ్లిసిటీ స్టంట్స్ వేస్తున్నారో లేక నిజంగా ఆ న‌టి జీవిత చ‌రిత్ర ఆధారంగానే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారో తెలియాలంటే శుక్ర‌వారం వ‌ర‌కు ఆగాల్సిందే.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat