Home / ANDHRAPRADESH / టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే ఔట్ …

టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే ఔట్ …

ఏపీ లో సార్వత్రిక ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి .దీంతో ఆ పార్టీకి ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .గత పదేండ్లుగా ఇటు పార్టీకి అటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఈగ వాలకుండా కాపాడుతూ ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా వైసీపీ అధినేత మొదలు ఆ పార్టీకి చెందిన నేతలను నోటికి ఎంత వస్తే అంత మాటలు జారుతూ పరుష పదజాలంతో విమర్శలు చేస్తూ వార్తల్లో నిత్యం నిలిచేవారు .

అట్లాంటి నాయకుడు ఎమ్మెల్యే ప్రస్తుతం మౌనంగా ఉన్నారు .ఒకానొక సమయంలో మంత్రి పదవి రాకపోవడంతో ఏకంగా తమ సామాజిక వర్గం గొంతు కోశారు అంటూ తీవ్ర పదజాలంతో బాబుపై విరుచుకుపడ్డారు .ఇంతకూ ఎవరు ఆ ఎమ్మెల్యే అని ఆలోచిస్తున్నారా .?.అయనే గత సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన బొండా ఉమా .అయితే బొండా ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణ సందర్భంగా మీరు కాపులను మోసం చేస్తూ వారి గొంతులను కోస్తున్నారు .

ఇలా చేయడం మీకు మంచిది కాదు అని ఏకంగా బాబుపై విరుచుకుపడ్డాడు .అది కూడా మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న సమయంలో లైవ్ పెట్టి ఇలా మాట్లాడటంతో బాబు బొండాను పక్కన పెట్టేశారు అంట . అందుకే ఇటీవల ఇచ్చిన ప్రభుత్వ చీఫ్ విప్ పదవికి మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిని ఎంపిక చెయ్యడం బోండా ఉమను దూరం పెట్టారనడానికి నిదర్శనం అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .అంతే కాకుండా బొండా కూడా ఇటు పార్టీ అటు ప్రభుత్వ కార్యక్రమాలకు ఏమి హాజరు కాకపోవడంతో కూడా బొండాను బాబు దూరం పెట్టేశాడు..అందుకే బొండా పార్టీ మారడానికి కూడా సిద్ధంగా ఉండొచ్చు  అని అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat