Home / TELANGANA / ఢిల్లీలో సీఎం కేసీఆర్ ధ‌ర్నా….

ఢిల్లీలో సీఎం కేసీఆర్ ధ‌ర్నా….

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అనూహ్య రీతిలో మ‌ద్ద‌తు ద‌క్కింది. రిజర్వేషన్లు అమలు చేసుకునే హక్కు రాష్ర్టాలకే ఉండాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీఎం కేసీఆర్ ధ‌ర్నా త‌ల‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. భిన్న సామాజిక కూర్పులతో కూడిన వివిధ రాష్ర్టాలున్న మన దేశంలో, ఆయా రాష్ర్టాలు తమ అవసరాలకు అనుగుణంగా, తమ రాష్ర్టాలకు అనుకూలంగా ఇచ్చుకునే రిజర్వేషన్ల కోసం కేంద్రంను ఆశ్రయించవ‌ల్సిన ప‌రిస్థితిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సవాలు చేయనున్నారు. ఇందుకోసం భావసారూప్యత కలిగిన ముఖ్యమంత్రులతో కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రస్థాయి రిజర్వేషన్ల మీద రాష్ర్టాలకే అధికారం నినాదంతో ఆయన పోరాటానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ పోరాటానికి ఊహించని మ‌ద్ద‌తు ద‌క్కింది. రిజర్వేషన్ల పెంపును రాష్ర్టాలకే క‌ట్ట‌బెట్టాల‌ని సీఎం కేసీఆర్ పోరాటానికి….త‌మిళ‌నాడు ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత‌, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మద్దతు తెలిపారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మ‌ద్దతుగా డీఎంకే అధినేత కరుణానిధి తరపున తాను సంఘీభావం తెలుపుతున్నట్లు స్టాలిన్ ఆదివారం ప్రకటించారు. ఈ మేర‌కు ప్ర‌త్యేకంగా లేఖ రాశారు. దీంతో కృత‌జ్ఞ‌త‌గా స్టాలిన్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్ చేశారు. రాష్ర్టాల హక్కుల సాధనంలో మద్దతుగా నిలిచినందుకు స్టాలిన్‌కు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్ల సాధనలో కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించారు. రాష్ర్టాల అధికారం కోసం తాము చేస్తున్న కృషికి స్టాలిన్ మద్దతు పలికారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కాగా, ఈ ప‌రిణామం రాజ‌కీయవ‌ర్గాల్లో కీల‌క‌ప‌రిణామానికి వేదిక‌గా మారింది. ద‌క్షిణాదిలో కీల‌క రాష్ట్రంలో ముఖ్యమైన పార్టీ మ‌ద్ద‌తు పొందడం సీఎం కేసీఆర్‌కు ద‌క్కిన గుర్తింపు అని ప‌లువురు పేర్కొంటున్నారు.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కేంద్రాన్ని అభ్యర్థించారు. సామాజిక న్యాయం సాధనకు రాష్ర్టాలకు అధికారమివ్వాలని సీఎం కేంద్రాన్ని అభ్యర్థించారు. రిజర్వేషన్లు అమలు చేసుకునే హక్కు రాష్ర్టాలకే ఉండాలన్న డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీఎం కేసీఆర్ ధర్నాకు సిద్ధ‌మ‌య్యారు. దీంతో పాటుగా రిజర్వేషన్ల పెంపు మీద, ఓబీసీలు, ఎంబీసీలు, ఎస్సీ, ఎస్టీల వర్తమాన సామాజిక, ఆర్థిక స్థితిగతులమీద దేశవ్యాప్తంగా చర్చ జరుగాలని కూడా ఆయన భావిస్తున్నారు. సామాజిక అసమానతలను కూకటి వేళ్లతో పెకిలించాలంటే అణగారిన వర్గాలకు విద్య, ఉద్యోగావకాశాలను ముమ్మరంగా అందించాల్సిన అవసరముందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా ఆయా రాష్ర్టాల అవసరాలను రాష్ట్రాలే నిర్ణయించుకోగలవు కాబట్టి కేంద్రం రాజ్యాంగ సవరణ చేసి ఆ అధికారాన్ని రాష్ర్టాలకే కల్పించాలనే అంశంమీద దేశవ్యాప్త చర్చ లేవనెత్తాలనే ఆలోచనలో సీఎం ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat