Home / ANDHRAPRADESH / బాబుకు గుజరాతీ దెబ్బ రుచి చూయించిన మోదీ..

బాబుకు గుజరాతీ దెబ్బ రుచి చూయించిన మోదీ..

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం ,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీల మధ్య ఉన్న మైత్రీ అందరికి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు కల్సే పోటి చేశారు .తదనంతరం టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చాడు .అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీడీపీ తరపున గెలిచిన ఎంపీలకు కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పించాడు .గత మూడున్నర ఏండ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న మైత్రీ అంత సక్కగా ఉన్నదీ .తాజాగా ఏపీ ప్రజల జీవనాడీ అయిన పోలవరం ప్రాజెక్టు వీరిద్దరి మధ్య పొరలు వచ్చే విధంగా దోహదపడిన సంగతి కూడా తెల్సిందే .

అయితే ఇదే అంశం గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ కేంద్రం కొంతమంది చేస్తున్న అసత్య ఆరోపణలను పట్టుకొని పోలవరం ప్రాజెక్టుకు నిధులు చెల్లించడంలేదు .ఇలా అయితే ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తిచేయడం కుదరదు .కేంద్రం తన తీరు మార్చుకోవాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .ఇదే అంశం మీద బీజేపీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ బాబు కావాలనే ప్రాజెక్టును ఆలస్యం చేయడమే కాకుండా ..ప్రాజెక్టు టెండర్ల విషయంలో తెలుగు తమ్ముళ్ళకు కట్టబెట్టి భారీ స్థాయిలో అవినీతికి పాల్పడటం వలన కేంద్రం నిధులు సక్రమంగా ఖర్చు చేయడం లేదు .

వాటికి సంబంధించిన లెక్కలను అడిగింది మినహా ఎక్కడ కూడా ప్రాజెక్టుకు సహకరించం అని చెప్పలేదు అని టీడీపీ పై ఎదురుదాడికి దిగారు .తాజాగా ప్రధాని కార్యాలయం నుండి ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయానికి “పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల వివరాలు ,ఖర్చుల వివరాలు అన్ని సక్కగా ఉంటేనే కేంద్రం నిధులు విడుదల చేస్తుంది .లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే తమ సొంత నిధులతో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసుకోవాల్సి వస్తుంది అని స్పష్టమైన ఆదేశాలను జారిచేస్తూ ఒక లేఖను పంపించింది అని రాష్ట్ర రాజకీయాల్లో ,ఇటు రాష్ట్ర ప్రభుత్వ ,అటు కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో కోడై కూస్తున్నారు .అంతే కాదు లెక్కలు తేలేవరకు కేంద్రం నిధులు కూడా ఇవ్వదు అని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొంది అంట ప్రధాని కార్యాలయం .అసలే గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకున్న బాబు తాజాగా కేంద్రం నిర్ణయంతో పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అయింది పరిస్థితి .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat