Home / MOVIES / ఛాన్సుల కోసం మిల్కీ బ్యూటీకి ఇన్ని క‌ష్టాలా..?

ఛాన్సుల కోసం మిల్కీ బ్యూటీకి ఇన్ని క‌ష్టాలా..?

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌లో న‌టించి ప్ర‌తి ఇండ‌స్ర్టీలోనూ స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభ‌వించింది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. టాప్ మూవీస్‌లో న‌టించ‌డ‌మే కాకుండా.. టాప్ హీరోస్‌తో సైతం న‌టించ‌డం త‌మ‌న్నా సొంతం. అయితే, న‌టిగా కాకుండా మోడ‌ల్‌గా త‌మ‌న్నాకు మాంచి క్రేజ్ ఉంది. ఇందుకు కార‌ణం త‌మ‌న్నా నూటికి నూరుశాతం బ్యూటీని క‌లిగి ఉండ‌ట‌మే.

అయితే, ప్ర‌స్తుతం త‌మ‌న్నా సినిమా అవ‌కాశాల కోసం ఎదురు చూస్తోంది. బాహుబ‌లి వంటి పెద్ద చిత్రంలో న‌టించినా త‌మ‌న్నాకు ప్ర‌స్తుత రోజులు క‌లిసి రావ‌డంలేదు. దీంతో ఆమెపై ఐర‌న్‌లెగ్ ముద్ర ప‌డేలా ఉంది. త‌మ‌న్నా ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించిన సినిమాలు క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ కాక‌పోవ‌డం, అందులోనూ బాహుబ‌లి వంటి చిత్రంలో అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కే త‌ప్ప న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర ల‌భించ‌క‌పోవ‌డం వంటివి అందుకు కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

తాజా స‌మాచారం మేర‌కు త‌మ‌న్నా ఓ బాలీవుడ్ సినిమాలో న‌టించ‌నుంది. అది కూడా త‌మిళంలో సిద్ధార్థ్ హీరోగా ల‌క్ష్మీ మీన‌న్ హీరోయిన్‌గా న‌టించిన జిగ‌ర్తాండ బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. ఈ రీమేక్ చిత్రానికి బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్‌దేవ‌గ‌న్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. నిసికాంత్ కామంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలో త‌మ‌న్నాకు జోడీగా ఫ‌రాన్ అక్త‌ర్ న‌టిస్తుండ‌గా సంజ‌య్‌ద‌త్ ఓ కీల‌క పాత్ర‌లో మెర‌వ‌నున్నాడు. ఇప్ప‌టికే ఐర‌న్‌లెగ్ అన్న ముద్రను మోస్తున్న త‌మ‌న్నాను జిగ‌ర్తాండ బాలీవుడ్ రీమేక్ ఏ మేర‌కు ఆదుకుంటుందో వేచి చూడాలి మ‌రి..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat