Home / ANDHRAPRADESH / జనసేన పార్టీలోకి అగ్రహీరో ..

జనసేన పార్టీలోకి అగ్రహీరో ..

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్రప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మీద కోపంతో జన సేన పార్టీను ఏర్పాటు చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ,నవ్యాంధ్ర రాష్ట్రంలో టీడీపీ పార్టీకి మద్దతు తెలిపాడు .దీంతో ఏపీలో జగన్ కు అధికారం దూరం కావడానికి ..బాబుకు సీఎం కుర్చీ దక్కడానికి ప్రధాన కారణమయ్యారు పవన్ .

అయితే ఒక ప్రముఖ స్టార్ హీరో ,తనకు సినిమా ,రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ,సొంత అన్నయ్య అయిన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలోకి వస్తారు అంటూ జనసేన వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .గతంలో చిరు ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసిన సమయంలో తమ్ముడు పవన్ కు యువరాజ్యం అధినేతగా బాధ్యతలు అప్పజెప్పి ఎన్నికల రంగంలోకి దించారు  .తాజాగా తమ్ముడు జనసేన పార్టీను స్థాపించి ఇటు అధికార పార్టీ టీడీపీకి మద్దతు తెలుపుతూ ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారు .

ఇలాంటి తరుణంలో తన అన్నను గతంలో మోసం చేసినవారిని ఒకరి తర్వాత ఒకర్ని టార్గెట్ చేస్తూ విమర్శల పర్వం కురిపిస్తున్నారు పవన్ .ఇలా విమర్శలు కురిపిస్తూ తన అన్నను జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తాను అని పరోక్ష సంకేతాలు ఇస్తున్నాడు పవన్ .అయితే చిరు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన కానీ ఇంకా ఒకటో రెండో మూవీలకు పరిమితం అవ్వనుండటంతో ఆయన తర్వాత కెరీర్ రాజకీయమే అని చిరు సన్నిహితులు చెబుతున్నారు .ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్ లో చేరి తప్పు చేశాను అని ఫీల్ అవుతున్న చిరు ఈ సారి జనసేన లో చేరి ఎంపీగా గెలిచి ..ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి తీసుకోవాలని ఆయన యోచిస్తున్నారు టాక్ .చూడాలి మరి చిరు చేరతారో ..లేదా ఇవి ఉహజనిత వార్తలో ..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat