ఏపీ సినీ రాజకీయ వారసత్వాల పై తాజాగా చర్చ నిర్వహించిన తెలుగు చానల్ లైవ్లో ప్రముఖ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టారు. బండ్ల గణేష్ ఆ చానల్ లైవ్లో ఉండగా.. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫోన్ లైన్లోకి వచ్చారు. అయితే సినీ రాజకీయ వారసత్వాల పై రోజా తనదైన వివరణ ఇస్తుండగా.. బండ్ల గణేష్ మధ్యలోకి వచ్చి నోరుజారారు.
రోజాని కామెంట్స్ చేస్తూ.. నువ్వు గోల్డెన్ లెగ్వీ, రాజశేఖర్ రెడ్డిని పైకి పంపించేశావ్.., ఇప్పుడు జగన్ పక్కన చేరావ్ అక్కడే ఉండు.. అంటూ సెటైర్లు వేశాడు. దీంతో ఫైర్ అయిన రోజా నువ్వు పవన్ పక్కన ఉండి పక్కలేస్తావా అంటూ అడగ్గా.. అవును నేను పక్కలేసే పైకొచ్చా నిన్ను కూడా పడుకోబెడతా అంటూ దిక్కుమాలిన కామెంట్స్ చేశాడు. దీంతో ఆగ్రహించిన రోజా… పళ్లు రాలిపోతాయ్ అంటూ జబర్ధస్త్ వార్నింగ్ ఇచ్చింది.