Home / MOVIES / కోహ్లీ, అనుష్కల క‌ల‌యిక‌కు అదే కార‌ణమా..!?

కోహ్లీ, అనుష్కల క‌ల‌యిక‌కు అదే కార‌ణమా..!?

జుట్టు రాలుతుంద‌ని అంద‌రూ తిట్టుకోవ‌డం స‌హ‌జ‌మే. కానీ, జుట్టు రాల‌డానికి కార‌ణ‌మైన డాండ్ర‌ఫ్ కూడా ఓ జంట‌ను ఒక్క‌టి చేయ‌గ‌ల‌ద‌ని ఎప్పుడూ ఊహించ‌లేదు క‌దూ. అవును డాండ్ర‌ఫ్ ఓ జంట‌ను ఒక్క‌టి చేసింది. వారే ఇండియ‌న్ క్రికెట్ కెప్టెన్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క‌శ‌ర్మ‌. వీరికి డాండ్ర‌ఫ్‌కు సంబంధం ఏమిట‌నుకుంటున్నారా..? అయితే, మీరు ఇది చ‌ద‌వాల్సిందే.!

మొన్న‌టి వ‌ర‌కు కోహ్లీ, అనుష్క‌ల పెళ్లి ఎప్పుడూ అంటూ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు కొన‌సాగ‌గా.. ప్ర‌స్తుతం వారు పెళ్లితో ఒక్క‌ట‌వ్వ‌డంతో అస‌లు వీరు క‌ల‌యిక ఎలా జ‌రిగిందంటూ మ‌రో చ‌ర్చ‌కు తెర‌లేపారు నెటిజ‌న్లు. కొంద‌రేమో కోహ్లీ ఏమో క్రికెట్ స్టార్‌, అనుష్క‌నేమో బాలీవుడ్ స్టార్‌.. ఇక వీరి క‌ల‌యిక ప్ర‌త్యేకంగా చెప్పాలా ఏంటీ అంటూ కామెంట్లు చేస్తుండ‌గా.. మ‌రికొంద‌రేమో వీరి మొద‌టి క‌ల‌యిక డాండ్ర‌ఫ్ యాడ్‌తో ఒక్క‌ట‌య్యార‌ని కామెంట్లు చేస్తున్నారు. అయితే, డాండ్ర‌ఫ్ నివార‌ణ కోసం ఓ కంపెనీ చిత్రీక‌రించిన షాంపు యాడ్‌లో కోహ్లీ, అనుష్క న‌టించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే వీరిరువురూ ఇట‌లీలోని ట‌స్క‌నీలో జ‌రిగిన వివాహంతో ఒక్క‌టైన విష‌యం తెలిసిందే. వీరి పెళ్లికి అతికొద్దిమంది స‌న్నిహితులు, స్నేహితులు, కుటుంబ స‌భ్యుల మ‌ధ్య జ‌రిగిన విష‌యం విధిత‌మే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat