Home / NATIONAL / కలెక్టర్‌ స్వయంగా తన కారులో పదోతరగతి టాపర్‌ అమ్మాయిని…!

కలెక్టర్‌ స్వయంగా తన కారులో పదోతరగతి టాపర్‌ అమ్మాయిని…!

ఐఏఎస్‌ అధికారి కావటమే తన జీవిత లక్ష్యమన్న ఓ బాలికకు చిరస్మరణీయమైన ప్రేరణను కల్పించేందుకు ఆ జిల్లా కలెక్టర్‌ అనూహ్యమైన నిర్ణయం తీసుకుని పలువురి ప్రశంసలు అందుకున్నారు. తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలో పదోతరగతి పరీక్షలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులను అందజేసే కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కేఎస్‌ కందసామి విద్యార్థులను వారి జీవిత లక్ష్యాలేమిటో చెప్పాలని కోరగా  491/500 మార్కులు సాధించిన మనీషా అనే బాలిక తాను ఐఏఎస్‌ కావాలనుకుంటున్నట్టు తెలిపింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆ బాలిక ధైర్యంగా తన లక్ష్యాన్ని వివరించిన తీరు  కలెక్టర్‌ను ఆకట్టుకుంది. బహుమతి ప్రదానం అనంతరం ఆమెను స్వయంగా తన కారులో కూర్చుబెట్టిన ఆయన వాహనం బయట నిలబడి ఫొటో దిగారు. అనంతరం ఓ ప్రతిని మనీషాకు అందజేస్తూ…లక్ష్యాన్ని ఛేదించే వరకూ ఈ ఫొటో నుంచి స్ఫూర్తి పొందాలంటూ ఆశీర్వదించారు. మనీషా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతోంది. కలెక్టర్‌ కారులో కూర్చోవటం తనను ఎంతో భావోద్వేగానికి గురి చేసిందని, ఈ ఘటనను ఎప్పటికీ మరచిపోలేనని మనీషా తెలిపింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat