Home / TELANGANA / 2017లో మిస్టరీగా మిగిలిన బ్యూటీషియన్ శిరీష డెత్‌…మరోవైపు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య..

2017లో మిస్టరీగా మిగిలిన బ్యూటీషియన్ శిరీష డెత్‌…మరోవైపు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య..

ఒక బ్యూటీషియన్ చావుతో మరోక ఎస్సై చావు ఎన్నో అనుమానలు,కార‌ణాలు, నాశనమైన జీవితాలు.ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన ఆమె మ‌ర‌ణం ఎలా జ‌రిగింది అనేది గత జూన్ నెలలో ఒక హాట్ టాపీక్ బ్యూటీషియన్ శిరీష ఆత్మ‌హ‌త్య‌ …మరోవైపు శిరీష ఆత్మ‌హ‌త్య‌ కేసులో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసు మరో కొత్త సంచలనంగా మారింది. 2017 జూన్ నెల 13వ తేదీన మంగళవారం హైదరాబాద్ మహానగరంలో ఫిల్మ్‌నగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీలో శిరీష అనే బ్యూటిషన్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ 
బ్యూటిషియన్‌గా పనిచేస్తున్న శిరీష ఆత్మహత్యలో కొత్తకోణాలు వెలికివస్తున్నాయి. కుకునూరుపల్లి ఎస్సై మధ్యాహ్నం ఒంటిగంటకు ఆత్మహత్య చేసుకోవడానికి శిరీష ఆత్మహత్యకు లింకున్నట్లు వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టినాయి. ఓ వివాదంపై శిరీష టీమ్ కుకునూరుపల్లి ఎస్సై వద్దకు వెళ్లారు. ఆ క్రమంలో వారు అక్కడ మద్యం సేవించారు. ఆ మద్యం మత్తులో గొడవలు జరిగినట్లు తెలిపారు. అంతేగాక ఆ పంచాయతీ తెల్లవారు జాము 3 గంటల వరకూ జరుగుతూ…అదలా సాగుతుండగానే ఎస్సై మద్యం మత్తులో శిరీషపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
తనపై జరిగిన దారుణాన్ని జీర్ణించుకోలేని శిరీష తిరుగు ప్రయాణంలో కారులో నుంచి దూకేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఐతే చివరికి ఆమె తన కార్యాలయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఐతే తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని శిరీష తన స్నేహితురాలితో పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిరీషతో పాటుగా కుకునూరుపల్లి వెళ్లిన రాజీవ్, శ్రావణ్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుంచి కీలక సమాచారం రావడంతో, ఇందులో ఎస్సై దోషిగా నిలబడక తప్పదని తేలడంతో ప్రభాకర్ రెడ్డి భయంతో తన సర్వీస్ రివాల్వరుతో సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తోంది.

మరోవైపు శిరీష మృతదేహాన్ని పరిశీలించినప్పుడు ఆమె పెదవులపై, మెడపై పంటిగాట్లు వున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమె భర్త తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని చెప్పడం చూస్తుంటే అది హత్యేనేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఈ మొత్తం వ్యవహారంలో ఆర్‌జే ఫొటోగ్రఫీ సంస్థ యజమాని వల్లభనేని రాజీవ్‌, అతడి స్నేహితుడు శ్రావణ్ పాత్ర వుంది. ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మరోమారు శ్రవణ్‌ను విచారించారు. ఈ నేపథ్యంలో పలు కీలక విషయాలను శ్రవణ్ తెలిపినట్టు తెలుస్తోంది. తన ఫ్రెండ్‌ శిరీష, ఆమె స్నేహితుడు రాజీవ్‌ మధ్య విభేదాలు పెరిగిపోయాయని, వారిద్దరినీ అక్కడికి తీసుకొస్తానని, ఈ సమస్యను పరిష్కరించాలని ఎస్సై ప్రభాకర్ రెడ్డిని కోరినట్టు శ్రవణ్ తెలిపాడు.

అయితే ఈ వ్యవహారం రాజీవ్‌కు తెలియకుండా చూసుకుందామని కూడా అన్నాడని తెలుస్తోంది. పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పని శ్రవణ్… కొన్నింటికి మాత్రమే సమాధానం చెప్పినట్లు సమాచారం. తొలిసారి ముగ్గురూ సిగిరెట్ తాగేందుకు వెళ్లగా, రెండోసారి కేవలం రాజీవ్‌ను మాత్రమే సిగిరెట్ పేరుతో బయటకు తీసుకొచ్చాడని చెప్పాడు. దీంతో ప్రభాకర్ రెడ్డి అత్యాచారయత్నం చేయడం జరిగినట్లు శ్రవణ్ వెల్లడించాడు. అలాగే రెండు సార్లు ఎస్సై ప్రభాకర్ రెడ్డి వద్దకు తాను అమ్మాయిలను పంపినట్టు శ్రవణ్ పోలీసులతో చెప్పాడని తెలుస్తోంది.
కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య
ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది. శిరీషపై ఎస్ఐ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడని ఈ విషయం బయటకు తెలిసి త‌న పరువు పోతోందనే భయంతో ఆత్మహత్య చేసుకొన్నాడని ఇప్పటివరకు పోలీసులు ప్రకటించారు.అయితే ఈ వాదనతో ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులు ఏకీభవించడం లేదు. ఇదిలా ఉంటే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో గజ్వేల్ ఏసీపీ గిరిధర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసుకు సంబంధించి వారి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గజ్వేల్ ఏసీపీ గిరిధర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గిరిధర్ ను ఏ1 గా చేర్చారు. ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు ఏసీపీ గిరిధర్ ప్రధాన కారణమంటూ కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు.
మరోవైపు, ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య వెనుక ఉన్నతాధికారుల వేధింపులు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శిరీష ఆత్మహత్య కేసులో విచారణ మొత్తం తప్పుల తడకగా సాగుతోందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం తాము నిష్పాక్షికంగా, నిజాయతీగా దర్యాప్తు చేస్తున్నామని, ఎవరికైనా అనుమానాలుంటే తమను కలిస్తే వారి అనుమానాలు తీరుస్తామని చెప్పారు. ఇంతవరకు ఈ ఇద్దరి ఆత్మహత్యల కేసు 2017 లో పెద్ద సంఛలనంగా మారింది..మిస్టరిగానే మిగిలిపోయింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat