Home / Top in 2017 / ఈ ఏడాది అంబరాన్నంటిన తెలంగాణ అవతరణ దినోత్సవాలు..

ఈ ఏడాది అంబరాన్నంటిన తెలంగాణ అవతరణ దినోత్సవాలు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగు ఏండ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్రావతరణ వేడుకలు ఈ ఏడాది జూన్ 2 న రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి .అరవై యేండ్ల కల సాకారమైన సందర్భంగా ఒక్క రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ నలుమూలల ఉన్న తెలంగాణ వారు రాష్ట్రావతరణ వేడుకలు ఎంతో ఉత్సాహంగా సంబురంగా జరుపుకున్నారు .ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా జరిపింది .అందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్రావతరణ వేడుకలు జరిగాయి .ఈ వేడుకలకు రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాల నుండే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు హాజరయ్యారు .

రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాల కేంద్రాల్లో మంత్రులు ,మండల గ్రామ కేంద్రాల్లో నేతలు జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్రావతరణ వేడుకలను జరిపించారు .ఈ వేడుకల సందర్భంగా గత నాలుగు ఏండ్లుగా సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా భవిష్యత్తులో చేయబోయే పలు కార్యక్రమాల గురించి వివరించారు .రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా సర్కారు ముప్పై ఒక్క జిల్లా కేంద్రాలలో కవులకు ,పలు రంగాల్లో ప్రతిభను కనబరిచిన ప్రముఖులకు అవార్డులను ఇచ్చి సన్మానించారు .అంతే కాకుండా రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను ఆహ్వానించి వారికి తగిన గౌరవం ఇచ్చింది .

అమరవీరుల కుటుంబాలలో అర్హులుంటే ఉద్యోగం ,పది లక్షల రూపాయలు ,భూమిని అందజేశారు .ఇక రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణ్ లక్ష్మీ, షాదీ ముబారక్, మాతా శిశు సంరక్షణ కిట్లు, నిరంతరవిద్యుత్ సరఫరా, డబుల్ బెడ్ రూమ్ వంటి అంశాల పై ప్రస్తావించారు. రాబోయే కాలంలో బంగారు తెలంగాణ సాధించేందుకు..గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ విషయంలో వెనక్కు తగ్గలేదన్నారు. హైదరాబాద్ ను ఐటీలో అగ్రగామిగా నిలపడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. రానున్న కాలంలో ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి పెట్టేందుకు సిద్దమని ఆయన చెప్పారు. గొర్రెల పంపిణీ, చేపల పెంపకం వంటి అనేక చర్యలతో బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat