Home / MOVIES / టాలీవుడ్ లో విషాదాన్ని మిగిలిచ్చిన దాసరి మరణం..!

టాలీవుడ్ లో విషాదాన్ని మిగిలిచ్చిన దాసరి మరణం..!

తెలుగు సినీ పరిశ్రమకు మూల స్థంభం ప్రముఖ దర్శకుడు, నిర్మాత, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు.ఎంతో మంది నటులకు సినీరంగ
ప్రవేశం కల్పించిన ఈయన 1944 మే 4 న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో సాయి రాజు – మహలక్ష్మి దంపతులకు జన్మించాడు.చిన్నతనంలో కడు పేదరికం అనుభవించాడు . కేవలం బడికి వెళ్ళడానికి ఫీజు కూడా కట్టలేని స్థితిలో అయన కుటుంబం వుండేది. అటువంటి పరిస్థితుల్లో అయన వడ్రంగి పని చేసుకుంటూ వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషిస్తూ..అయన చదువుకునే వారు..1973లో హాస్య నటుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టి అంచలంచెలుగా ఎదిగి రచయితగా , దర్శకుడిగా , నిర్మాతగా అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు.

తెలుగు సినీ పరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాద్ కు తీసుకరావడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.తాతా మనువాడు సినిమా ద్వారా దర్శకుడి అవతారమేత్తిన దాసరి నారాయణ..151సినిమాలకు పైగా దర్శకత్వం వహించి.. దర్శక రత్న హోదా పొందాడు . ఎన్నో జాతీయ ,రాష్ట్ర స్థాయి అవార్డులను సొంతం చేసుకున్న దాసరి..గిన్నీసు బుక్ లో తనకంటూ ఒక పేరును సంపాదించాడు.దాసరి నిర్మించిన చిత్రాల్లో ప్రేమాభిషేకం ,మేఘ సందేశం , ఒసేయ్ రాములమ్మ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకున్నాడు .

దర్శకుడిగానే కాకుండా రచయిత గా మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక నటుడిగా దాసరి అందం కోసం పందెం సినిమాతో కెమరా ముందుకు వచ్చాడు .1991లో మామగారు సినిమాతో మంచి నటుడిగా కూడా గుర్తింపు పొందాడు .ఈ విధంగా అంచెలంచెలుగా ఎదిగా రాజకీయ ప్రవేశం చేశాడు .కేంద్ర మంత్రి హోదాలో భాద్యతలు నిర్వహించి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందాడు..ఈ విధంగా తనకంటూ ఒక పేజీని సంపాదించుకున్న దాసరి నారాయణరావు అనారోగ్యంతో భాదపడుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగం లోని కిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మే ౩౦ వ తేదిన తుది శ్వాస విడిచారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat