Home / ANDHRAPRADESH / సాధ్యం కాదని తెలిసి మోసం…పోలవరం దృష్టి మళ్లించేందుకే..కాపు రిజర్వేషన్లపై బాబు ఎత్తుగడ..

సాధ్యం కాదని తెలిసి మోసం…పోలవరం దృష్టి మళ్లించేందుకే..కాపు రిజర్వేషన్లపై బాబు ఎత్తుగడ..

ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అత్యంత సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. 2014 ఎన్నిక‌లకు ముందు కాపు సామాజిక వ‌ర్గానికి ప్ర‌క‌టించిన విధంగా కాపుల‌ను బీసీల్లో చేరుస్తూ.. వారికి 5% రిజ‌ర్వేష‌న్ ప్ర‌క‌టించింది. దీనిపై అసెంబ్లీలో చ‌ర్చించి.. ఆమోదించి కేంద్రానికి పంప‌డం ద్వారా ఆమోదించుకోవాల‌ని బాబు ప్ర‌భుత్వం ప్లాన్.
సమస్యను సమస్యతోనే ఢీకొట్టించడం తప్ప పరిష్కారం వెతికే అలవాటు చంద్రబాబు లేనే లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడం మాని మరో కొత్త సమస్యను సృష్టించి వదలడం బాబు మార్కు రాజకీయం. బాధ్యతల నుంచి తప్పించుకోవడం కోసం ఎదుటి వారి మీద బురద చల్లి కడుక్కోమనడం చంద్రబాబు అనుసరించే వ్యూహం. దేనికీ సూటిగా సమాధానం చెప్పరు.. ఏ సమస్యనూ పరిష్కరించరు.. సమస్య దేనికదే విసుగుపుట్టి పరారవ్వాల్సిందే లేదా బాధితులే విసుగుచెంది ఆశలు వదుకోవాల్సిందే తప్ప ఆయనేం చేయరు. కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు అలాంటి మరో ఎత్తుగడకు తెరలేపారు. నాలుగేళ్లుగా నలుగుతున్న కాపు రిజర్వేషన్ల రగడను కేంద్రం మీదకు నెట్టేసి తప్పుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పథక రచన చేసినట్టుగా స్పష్టంగా కనపడుతోంది.

2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేరుస్తామని ఆశ కల్పించి సీఎం అయిన చంద్రబాబు పథకం ప్రకారం ఈ నాలుగేళ్లుగా లాక్కొచ్చారు. పోలీసులను పురమాయించి కాపుల ధర్నాలు ఆపడం, ప్రలోభాలకు గురిచేసి నిరసన కారులను తన పక్కకు తిప్పుకోవడం, కేసులతో బెదిరించి లొంగదీసుకోవడం.. కారణమేదైతేనేం నాలుగేళ్లు గడిచిపోయాయి. మంజునాథన్‌ కమిషన్‌ పేరుతో రెండున్నరేళ్లు కాలం వెళ్లదీశారు. ప్రభుత్వం ఏపీకి మారడంతో నివేదిక సమర్పించడం కుదరలేదని.. డాక్యుమెంట్లన్నీ హైదరాబాదులో ఉన్నాయని ఇన్నాళ్లు చెప్పుకొచ్చారు. అయితే దీనిని ఇంకెన్నాల్లో దాచలేమని అనుకున్నాడో.. వైయస్‌ జగన్‌ పాదయాత్ర నేపథ్యంలో జనం దృష్టిని తన వైపు తిప్పుకోవాలని అనుకున్నాడో కానీ.. మొత్తానికి కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పుకొచ్చాడు. కాపులను బీసీ ఎఫ్‌లుగా చేరుస్తామని అసెంబ్లీలో ప్రకటించాడు. అసెంబ్లీ తీర్మాణంతోనే కాపుల రిజర్వేషన్లు రావని.. అసలది జరిగే పనికాదని అందరికంటే చంద్రబాబుకే బాగా తెలుసు.

రిజర్వేషన్లు అమలు అంత వీజీ కాదు..
1. రిజర్వేషన్లు అంటేనే సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు ప్రవేశపెట్టినవి. అలాంటప్పుడు రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు కల్పించరు.
2. కేంద్రం కూడా ఈ మధ్య స్పష్టంగా చెప్పింది 50 శాతం రిజర్వేషన్లు సుప్రీం అంగీకరించడం లేదని.. అందుకుని ఆ పరిమితి రిజర్వేషన్లు సాధ్యం కావని తేల్చేసింది. ఎలాగూ అంగీకరించని రిజర్వేషన్లు కాబట్టే హామీ ఇచ్చేస్తే ఒరిగేదేముందని బాబు ముందడుగేశారు. ఇప్పటికే 50 శాతం కోటా దాటిపోయింది. ఇలాంటప్పుడు మళ్లీ కాపులకు 5 శాతం అంటే కుదిరేపనికాదు. అలాగని బీసీల్లో ఇప్పటికే ఉన్నవారి రిజర్వేషన్లు తగ్గించాల్సి వస్తే రణరంగమే.
3. 9వ షెడ్యూల్‌లో పెడితే చాలు.. రిజర్వేషన్లు అవుతాయనే భ్రమల్ని చంద్రబాబు ప్రజల్లో పెంచుతున్నారు. నిజానికి సుప్రీంకోర్టు ఆ 9వ షెడ్యూల్‌ స్ఫూర్తినే సమీక్షించబోతున్నది.
4. నిజానికి మంజునాథ కమిషన్‌ ఎక్కడా బీసీలకు ఎక్కడా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడా నివేదించలేదు. అయితే చంద్రబాబు రాజకీయ కోణంలో ఆలోచించి మెజారిటీ సభ్యుల పేరిట విడివిడి నివేదికల్ని తీసుకుని ఆమోదించినట్టు ప్రకటించేశాడు.
5. 22 నెలలుగా మంజునాథ కమిషన్‌ రిపోర్టు ఇవ్వడం లేదు.. ఇందులో కొంతకాలం అధ్యయనం, ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణకు ఖర్చయినా.. రిజర్వేషన్లకు సంబంధించి ఏకాభిప్రాయం కుదరకపోవడం ఒక కారణం. అయితే హైదరాబాదులో ఆఫీసు, తరువాత విజయవాడకు మారినా సరే ఫైళ్లు హైదరాబాదులో ఉండటం ఈ జాప్యానికియ కారణం అంటూ తన అనుకూల మీడియాలో రాయించుకోవడం కూడా చంద్రబాబు తరహా రాజకీయమే. జాప్యానికి నేను కారణం కాదని జనాన్ని నమ్మించడమే ఇలాంటి కట్టుకథలు అల్లి ప్రచారం ప్రారంభించారు.
6. గతంలో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు వైయస్‌ సంకల్పించినప్పడు ఇలాగే 0 శాతం రిజర్వేషన్లు దాటిపోయాయని తెలిసి ఒక శాతం తగ్గించి 4 శాతం అమలు చేశారు.
7. ఇప్పుడు కాపుల రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబుకు ఆ అవకాశం కూడా లేదు. ఇప్పటికే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోయాయి. అయినా ఇవ్వాలనుకుంటే బీసీల రిజర్వేషన్లతో కలిపి ఇవ్వాలి. అలా చేస్తే రణరంగమే. అందుకే తన మెడలో పడాల్సిన కాపుల వ్యతిరేక గండాన్ని మోడీ మెడలో వేసి చంద్రబాబు తప్పించుకోవాలని చూస్తున్నాడు.
పోలవరంపై నుంచి దృష్టి మళ్లించేందుకే..
పోలవరంలో వరుస తప్పులు క్రమంగా వెలుగులోకి వస్తుండటంతో చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రంపై వ్యాఖ్యలు చేసిన మరునాడే మాట మార్చారు. ఒకపక్క జగన్‌ పాదయాత్ర ప్రభావం, పోలవరంపై తాను చేసిన వ్యాఖ్యలు పార్టీ పట్ల వ్యతిరేకతకు దారితీస్తుండడం, కాపు రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రరూపం దాల్చేలా ఉండడంతో చంద్రబాబు వ్యూహాత్మకంగా కాపు రిజర్వేషన్లపై బిల్లు అంశాన్ని తెరపైకి తెచ్చారని విశ్లేషకులంటున్నారు. ఎన్నికల ముందు కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి దాన్ని పట్టించుకోకపోవడంతో ముద్రగడతో పాటు కాపు నాయకులు ఉద్యమాన్ని చేపట్టారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాలకు సంబంధించిన అన్ని వివరాలున్నా మంజునాథ్‌ కమిషన్‌ను ప్రకటించినా కాలయాపన జరుగుతుందనే అనుమానాలు కాపు సామాజికవర్గంలో నెలకొన్నాయి. ముద్రగడ ఉద్యమం వివిధ దశలను దాటుకుని డిసెంబరు ఆరో తేదీ నుంచి ఉధృతం కాబోతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో చంద్రబాబు సర్కారు ఆలోచనలో పడింది. మరోవైపు ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో ఇంకా జాప్యం చేయడమంటే కాపు వర్గాల్లో మరింత వ్యతిరేకత పెంచుతుందని భావించడంతో కేంద్రంపై నెట్టేయడానికి వ్యూహం రచించినట్లు కనిపిస్తోందని విశ్లేషకులంటున్నారు. కాపులను బీసీల్లోని చేర్చి రిజర్వేషన్లను తానే కల్పిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రంపైకి నెట్టేసే విధంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంపై తెలుగుదేశం పార్టీలోని కాపు నాయకులు అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఏమాత్రం ఉన్నా ముందుగానే కేంద్రంతో సంప్రదింపులు జరిపి సానుకూలత సాధించుకునే వారని, కానీ అలాంటి కనీస ప్రయత్నం కూడా చేయకుండానే చట్టసభల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపడమంటే చేతులు దులిపేసుకోవడమేనని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే కేంద్రం పరిధిలో గుజ్జర్లు, పటేళ్లు, జాట్ల రిజర్వేషన్‌ సమస్య కొన్నేళ్లుగా నలుగుతూనే ఉందని, ఇప్పుడు కాపుల రిజర్వేషన్‌ అంశాన్ని కూడా ఆ జాబితాలోకి చేర్చడం మినహా మరొకటి కాదని వారు గుర్తుచేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat